Minister Ponguleti: 22A బాధితులకు గుడ్‌న్యూస్.. కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 22-ఎ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి, సామాన్యులకు ఉపశమనం కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
యుద్ధప్రాతిపదికన దరఖాస్తుల పరిష్కారం
శాసనసభ హామీలకు అనుగుణంగా 22-ఎ జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులున్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిందని మంత్రి గుర్తుచేశారు. వీటితో పాటు జీవో 118, జీవో 76 మెమోలు, జీవో 59 అమలు, యూఎల్సీ దరఖాస్తులు, నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యలపై వచ్చిన ప్రతి దరఖాస్తును యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్‌లో ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు.
Also Read
- Pat Cummins: ట్యాంపరింగ్ కలకలం.. పబ్లిక్‌లోనే భార్యతో గొడవ.. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కీలక ప్రకటన..
- AP High Court: పంచాయతీ ఎన్నికల నామినేషన్లపై హైకోర్టు కీలక తీర్పు.. అధికారులకు ఆదేశాలు!
- Suryakumar Yadav: బీజేపీలోకి సూర్యకుమార్? యాదవుల ఓట్లే టార్గెట్.. యూపీ ఎన్నికల్లో స్కై భార్యకు టికెట్?
- India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
కలెక్టర్ల పర్యవేక్షణ..
ప్రభుత్వ జీవోలు, మెమోలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలైనప్పుడే ప్రజలకు నిజమైన ప్రయోజనం దక్కుతుందని మంత్రి అన్నారు. కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లు ప్రతి వారం సమావేశమై పురోగతిని సమీక్షించుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కాని అంశాలను రెవెన్యూ కార్యదర్శి డీఎస్ లోకేష్‌కుమార్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీకి సిఫార్సు చేయాలన్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలను, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన యజమానులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా చూడాలన్నారు. అదే సమయంలో ప్రభుత్వ, ప్రజా ప్రయోజన భూముల పరిరక్షణలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని హెచ్చరించారు.
యూఎల్సీ కోర్టు తీర్పులపై నివేదిక..
యూఎల్‌సీకి సంబంధించి వివిధ కోర్టుల తుది తీర్పులు, సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీల దాఖలుకు ఉన్న అవకాశాలపై ఉన్నతస్థాయి కమిటీ వారం రోజుల్లోగా సమగ్ర నివేదిక అందించాలని మంత్రి ఆదేశించారు. ఈ నివేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి రెగ్యులరైజేషన్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Minister Ponguleti: 22A బాధితులకు గుడ్‌న్యూస్.. కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు..
-
Kiara Advani: ‘టాక్సిక్’ ఇంటిమేట్ సీన్ల గురించి మా ఆయన నాతో మాట్లాడలేదు..
-
El Nino: ఎల్‌నినో దెబ్బ.. చుట్టుముడుతున్న వ్యాధులు..WHO సంచలన ప్రకటన!
-
Pat Cummins: ట్యాంపరింగ్ కలకలం.. పబ్లిక్‌లోనే భార్యతో గొడవ.. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కీలక ప్రకటన..
-
Smoking Vs Alcohol: స్మోకింగ్ మానడమే కష్టమా? ఇందులో నిజమెంత?
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!