NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy : ఇందిరమ్మ ఇళ్లు ఒక్కసారి ఇచ్చి వదిలేసే కార్యక్రమం కాదు

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy : పదేళ్ల పాలనకు.. ఏడాది ఇందిరమ్మ పాలనకు స్పష్టమైన తేడా ఉందని, మా ప్రభుత్వం వచ్చాక ధరణిని ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేము వచ్చే నాటికి 2 లక్షల 40 వేల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. డిసెంబర్ 1 నుంచి ధరణి పోర్టల్ ను NIC కి అప్పగించామని, 2024 కొత్త ఆర్వో ఆర్ చట్టాన్ని తయారు చేశామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదిస్తామని, గతంలో ధరణి 33 మాడ్యుల్స్ తో ఇబ్బందిగా ఉండేదన్నారు. మాడ్యుల్స్ ను తగ్గిస్తామని, వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థను గతంలో ఉన్న పెద్ద దొర రద్దు చేసారన్నారు. మళ్ళీ మేము ఈ వ్యవస్థలను తీసుకు వస్తామని, గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పింక్ షర్ట్స్ వేసుకున్న వాళ్ళకే వచ్చాయన్నారు. మేము అత్యంత నిరుపేదలకు మాత్రమే ఇళ్లు ఇస్తామని, ప్రతి నియోజక వర్గానికి 3500 ఇళ్లు అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఒక్కసారి ఇచ్చి వదిలేసే కార్యక్రమం కాదని, కేంద్రం ఇందిరమ్మ ఇళ్లకు నిధులు ఇవ్వకపోయినా మా ప్రభుత్వం ఇస్తుందన్నారు ఆయన.

AUS vs IND: ఓవైపు మెన్స్.. మరోవైపు ఉమెన్స్.. ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా భారీ ఓటమి

అంతేకాకుండా..’ఆనాటి ప్రభుత్వం ఖజానాను కొల్లగొట్టక పోయి ఉంటే వడివడిగా హామీలు నెరవేర్చే వాళ్ళం. అయినా మేము ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాం. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను పరిష్కారం చేసుకుందాం. రియల్ ఎస్టేట్ పడిపోయిందని కొంత మంది మాజీ మంత్రులు అంటున్నారు. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగిందని ప్రధాన ప్రతిపక్షం గ్రహించాలి. మేము 15 నుంచి 18 శాతం అనుకున్నాం కానీ..ఆశించినంత పెరగలేదు. ప్రతిపక్ష పార్టీకి జ్ఞానోదయం కలగకపోవటం బాధాకరం. ప్రతిపక్ష పార్టీకి డిశ్చార్జ్ షీట్ ప్రజలు ఇచ్చారు. ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లో నడుపుతున్నది తుగ్లక్ పాలనా?సెక్రటేరియట్ లో నడుపుతున్నది తుగ్లక్ పాలనా? రేపటి కార్యక్రమానికి కేసీఆర్‌ వస్తారని ఆశిస్తున్నాం.’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

Jeevan Reddy : ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది

Show comments