NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy : లగచర్లలో భూములు లేని నిరుపేదలను రెచ్చగొట్టారు

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy : నిర్మల్ జిల్లా భైంసాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల కనుసైగల్లో వారి స్వార్థం కోసం నిస్వార్థంతో పనిచేసే ఉద్యోగులను భయభ్రాంతలకు గురిచేశారని మండిపడ్డారు. వారి ఫోన్లో ఏమాట్లాడారో చూసామని, భూములు లేని నిరుపేదలను రెచ్చగొట్టారు.. కలెక్టర్‌ను చంపాలని రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. పింక్‌ కలర్ అసలు నాయకుల పాత్ర ఉందో దాన్నంతా ప్రభుత్వం ఎక్స్ రే తీసినట్ట అంతా బయకు తీస్తదని ఆయన అన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టదని, గత ప్రభుత్వ నాయకుల్లా కాదు.. ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలనేది మా ప్రభుత్వ చిత్తశుద్ది అని ఆయన అన్నారు.

Off The Record: కేటీఆర్ ఢిల్లీ టూర్‌లో అసలు జరిగిందేంటి..?

సగం కట్టి వదిలేసిన ఇండ్లపై రివ్యూ చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతామన్నారు మంత్రి పొంగులేటి. జనవరి నెల నుంచి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం అందిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండించిన ప్రతీ గింజ కొంటామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. అంతేకాకుండా… రైతుల కోసం అని కల్లాల బాట, మరో బాట అంటూ ఎవ్వరు పాదయాత్ర చేసి మోకాళ్లు అరగగొట్టుకోవాల్సిన పనిలేదని, డిసెంబర్ లోపు పక్కగా మిగిలిన రైతులకు రుణ మాఫీ చేస్తామని మంత్రి పోగులేటి హామీ ఇచ్చారు. మిగిలిన 13 వేల కోట్లు చెల్లిస్తామని, త్వరలో రైతు భరోసా ఒక కిస్తి చెల్లిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.

IT Minister Sridhar Babu: కేటీఆర్ అరెస్టు వ్యాఖ్యల పై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు