Amit Shah: లోక్‌సభ సాక్షిగా ఇండీ కూటమికి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్.. నార్త్ – సౌత్ అంటూ విడగొడితే ఖబర్దార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలులో ఎటువంటి జాప్యం లేదని, 2029 నాటికి మహిళలు పార్లమెంట్‌లో రిజర్వేషన్లతో అడుగుపెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. లోక్‌సభలో ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. పరిసీమన, ఓటు విలువ, విపక్షాల వైఖరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల మధ్య ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని అమిత్ షా ఎత్తి చూపారు.
READ ALSO: Women Reservation: సారీ మహిళ.. లోక్‌సభలో వీగిపోయిన బిల్లు..
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రస్తుతం దేశంలో 127 నియోజకవర్గాల్లో 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. కొన్ని చోట్ల 45 లక్షల మందికి ఒక ఎంపీ ఉంటే, మరికొన్ని చోట్ల కేవలం 6 లక్షల మందికే ఒక ప్రతినిధి ఉన్నారు. దీనివల్ల ప్రతి ఓటుకు సమాన విలువ ఉండటం లేదు. ‘ఒక వ్యక్తి-ఒక ఓటు-ఒక విలువ’ అనే సిద్ధాంతం అమలవ్వాలంటే పరిసీమన తప్పనిసరి” అని ఆయన వివరించారు. 2026 తర్వాత జరిగే జనాభా గణన ఆధారంగా ఈ ప్రక్రియ పూర్తి చేసి, మహిళా కోటాను ఖరారు చేస్తామని తెలిపారు.
ఇందిరా గాంధీ నిర్ణయాన్ని గుర్తు చేస్తూ..
పరిసీమనను ఇప్పుడే ఎందుకు తెస్తున్నారన్న విపక్షాల ప్రశ్నకు అమిత్ షా సమాధానమిస్తూ.. 1971లో ఇందిరా గాంధీ ప్రభుత్వం సీట్ల సంఖ్యను ఫ్రీజ్ చేసిందని గుర్తు చేశారు. ఆనాటి నిర్ణయం వల్లే ఇప్పుడు మనం ఈ ప్రక్రియను అనుసరించాల్సి వస్తోందని, ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే ముందుకు వెళ్తోందని చెప్పారు. ఉత్తర-దక్షిణ భారత దేశాల మధ్య విభజన రేఖలు గీసే ప్రయత్నాలను సహించబోమని ఆయన ఇండీ కూటమిని హెచ్చరించారు. “ఇండీ (INDIA) కూటమి సభ్యులు మహిళా రిజర్వేషన్లను మనస్ఫూర్తిగా స్వాగతించడం లేదు. రాజకీయాల కోసం వారు మతం ఆధారంగా ముస్లిం రిజర్వేషన్లు అడుగుతున్నారు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో మతపరమైన రిజర్వేషన్లకు అవకాశం ఉందో చెప్పాలి” అని ఆయన నిలదీశారు. మహిళా సాధికారతపై విపక్షాలు కేవలం భ్రమలు కల్పిస్తున్నాయని మండిపడ్డారు.
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?