NTV Telugu Site icon

TS Raj Bhavan: ఎట్ హోం కార్యక్రమానికి దూరంగా రాజకీయ నాయకులు

At Home

At Home

తెలంగాణలో ప్రగతి భవన్-రాజ్ భవన్ మధ్య వివాదం కొనసాగుతునే ఉంది. నేడు ( మంగళవారం ) తెలంగాణ రాజ్‌భవన్‌లో పంద్రాగస్టును పురస్కరించుకుని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఎట్‌హోం కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్ తో పాటు అందరికి ఆహ్వానం పంపించింది. అయితే, తేనీటి విందు కార్యక్రమానికి రాజకీయ నేతల ఎవరు రాకపోవడంతో.. రాజ్ భవన్ లో హడావిడి లేక వెలవెలబోయింది. మరోసారి ఈ తేనీటి విందు ప్రోగ్రాంకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరంగా ఉన్నారు.

Read Also: Vijay- Rashmika : విజయ్- రష్మిక పరిచయానికి ఐదేళ్లు.. ఇలా ప్రేమను బయటపెట్టారు

ఇక, సీఎం కేసీఆర్ వరుసగా మూడోసారి రాజ్ భవన్ లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేతతో పాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఇక.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సైతం ఎట్‌హోమ్‌ ప్రోగ్రాంలో కనిపించకపోవడం గమనార్హం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. తెలంగాణ బీజేపీ తరపున కీలకమైన నేతలు సైతం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. గవర్నర్ తమిళిసై నిర్విహించిన ఎట్ హోం కార్యక్రమానికి కేవలం తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్ ఆరాధేతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజన్ కుమార్ తో పాటు మరి కొంత మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. అధికార, విపక్ష పార్టీలు సైతం ఎట్ హోం కార్యక్రమానికి రాకపోవడంతో రాజ్ భవన్ పరిసరాలు అంత హాడావుడిగా కనిపించడం లేదు. దీంతో రాజ్ భవన్-ప్రగతి భవన్ మధ్య ఎప్పుడు సయోధ్య కుదురుతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Read Also: Nuh Voilence: నుహ్ హింసకు పాల్పడిన నిందితుడు అరెస్ట్