విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాం గ్రామంలో యువతిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమెను చీపురుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. తరువాత మెరుగైన చికిత్స కోసం విజయనగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా యువతిపై హత్యాయత్నం కేసును పోలీసు ఛేదించారు. యువతి ఆఖిలపై కత్తితో దాడి చేసిన ఆదినారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read:R. Krishnaiah: కంచె గచ్చిబౌలి భూమి విషయంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన రాజ్యసభ సభ్యుడు
సెక్సువల్ జలసీతోనే కత్తితో దాడి చేసినట్లు ఆదినారాయణ ఆంగీకరించాడు. హత్య అనంతం మాస్క్ పడేసి టీ షర్ట్ మార్చుకొని గ్రామస్తులతో కలిసిపోయాడు ఆదినారాయణ. అందరిలాగే అగంతకుడిని వెతుకుతున్నట్టు నటించాడు. దాడి అనంతరం కత్తిని తన డ్రాయర్ లో పెట్టుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. యువతి అఖిల ఇచ్చిన సమాచారంతో ఆదినారాయణను అదుపులోకి తీసుకొని విచారిచిన పోలీసులు.. చివరికి వేరొకరితో మట్లాడుతుందనే హతమార్చేందుకు సిద్దమైనట్టు ఆదినారాయణ అంగీకరించాడు.