Site icon NTV Telugu

New Year Events : న్యూయర్‌ వేడుకలకు సిద్ధమవుతున్నారా..? ఇది మీకోసమే..

New Year Celebrationsv

New Year Celebrationsv

న్యూయర్‌ వేడుకలు హైదరాబాద్‌లో ఎంత అట్టహాసంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. ఈ సంవత్సరం న్యూయర్‌ వేడుకలపై హైదరాబాద్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే.. అర్ధరాత్రి ఒంటిగంట వరకు మాత్రమే సెలబ్రేషన్స్ కు అనుమతి ఇచ్చారు పోలీసులు. పబ్బుల్లో మైనర్లను అనుమతిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న పోలీసులు హెచ్చరించారు. అంతేకాకుండా.. ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన సమయం వరకునే మద్యం అమ్మకాలు చేయాలి లేకపోతే కఠిన చర్యలు తప్పవని పోలీసులు పేర్కొన్నారు. న్యూ ఇయర్ ఈవెంట్స్ కోసం పది రోజుల ముందే పోలీసుల అనుమతి తీసుకోవాలని నిర్వాహకులకు పోలీసుల సూచనలు జారీ చేశారు. పబ్బుల్లో, ఈవెంట్స్ లో అశ్లీల నృత్యాలు అధిక శబ్దాలు వస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఈవెంట్స్ మొత్తం కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసుల సూచించారు. న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేయబోతున్న ఈవెంట్స్, పబ్బులలో 45 డేసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దాలు రాకుండా చూసుకోవాలన్నారు.
Also Read : ఇలాంటి సమయంలో సెక్స్ చేయకూడదు.. లేకపోతే ప్రాణాలు పోతాయ్..!

సామర్థ్యం కంటే ఎక్కువగా ఈవెంట్స్ పాసెస్ లుకానీ, పబ్స్ అనుమతి ఇవ్వకూడదన్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకల్లో గంజాయి డ్రగ్స్, అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. పబ్బు ఈవెంట్స్ పార్కింగ్ ప్రదేశాల్లో డ్రగ్స్ అమ్మకాలు చేసిన యాజమాన్యందే బాధ్యత అని పోలీసులు తెలిపారు. వేడుకల్లో ఈవెంట్స్, పబ్బుల నుండి బయటకు వెళ్లే వారికి క్యాబ్ లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నిర్వహకులదేనని పోలీసులు పేర్కొన్నారు. స్టార్ హోటల్, పబ్స్, ఈవెంట్స్ లలో మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమంటూ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి దొరికితే 10,000 జరిమానా? ఆరు నెలలు జైలు శిక్ష అని, మైనర్లు వాహనం నడిపి పట్టుబడితే వాహన యజమానిపై చర్యలు తీసుకుంటామన్నారు. పబ్బులు ఈవెంట్స్ స్టార్ హోటల్ వద్ద పార్కింగ్ యాజమాన్యాల ఏర్పాటు చేసుకోవాలని, న్యూ ఇయర్ వేడుకల్లో శాంతి భద్రతలు విఘాతం కలగకుండా చూసుకోవాలని పోలీసులు తెలిపారు.

Exit mobile version