New Year Events : న్యూయర్ వేడుకలకు సిద్ధమవుతున్నారా..? ఇది మీకోసమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూయర్ వేడుకలు హైదరాబాద్‌లో ఎంత అట్టహాసంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. ఈ సంవత్సరం న్యూయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే.. అర్ధరాత్రి ఒంటిగంట వరకు మాత్రమే సెలబ్రేషన్స్ కు అనుమతి ఇచ్చారు పోలీసులు. పబ్బుల్లో మైనర్లను అనుమతిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న పోలీసులు హెచ్చరించారు. అంతేకాకుండా.. ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన సమయం వరకునే మద్యం అమ్మకాలు చేయాలి లేకపోతే కఠిన చర్యలు తప్పవని పోలీసులు పేర్కొన్నారు. న్యూ ఇయర్ ఈవెంట్స్ కోసం పది రోజుల ముందే పోలీసుల అనుమతి తీసుకోవాలని నిర్వాహకులకు పోలీసుల సూచనలు జారీ చేశారు. పబ్బుల్లో, ఈవెంట్స్ లో అశ్లీల నృత్యాలు అధిక శబ్దాలు వస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఈవెంట్స్ మొత్తం కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసుల సూచించారు. న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేయబోతున్న ఈవెంట్స్, పబ్బులలో 45 డేసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దాలు రాకుండా చూసుకోవాలన్నారు.
Also Read : ఇలాంటి సమయంలో సెక్స్ చేయకూడదు.. లేకపోతే ప్రాణాలు పోతాయ్..!
సామర్థ్యం కంటే ఎక్కువగా ఈవెంట్స్ పాసెస్ లుకానీ, పబ్స్ అనుమతి ఇవ్వకూడదన్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకల్లో గంజాయి డ్రగ్స్, అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. పబ్బు ఈవెంట్స్ పార్కింగ్ ప్రదేశాల్లో డ్రగ్స్ అమ్మకాలు చేసిన యాజమాన్యందే బాధ్యత అని పోలీసులు తెలిపారు. వేడుకల్లో ఈవెంట్స్, పబ్బుల నుండి బయటకు వెళ్లే వారికి క్యాబ్ లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నిర్వహకులదేనని పోలీసులు పేర్కొన్నారు. స్టార్ హోటల్, పబ్స్, ఈవెంట్స్ లలో మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమంటూ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి దొరికితే 10,000 జరిమానా? ఆరు నెలలు జైలు శిక్ష అని, మైనర్లు వాహనం నడిపి పట్టుబడితే వాహన యజమానిపై చర్యలు తీసుకుంటామన్నారు. పబ్బులు ఈవెంట్స్ స్టార్ హోటల్ వద్ద పార్కింగ్ యాజమాన్యాల ఏర్పాటు చేసుకోవాలని, న్యూ ఇయర్ వేడుకల్లో శాంతి భద్రతలు విఘాతం కలగకుండా చూసుకోవాలని పోలీసులు తెలిపారు.
Also Read
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
తాజావార్తలు
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!