ప్రజల రక్షణ మాత్రమే కాదు తమలోని స్పెషల్ టాలెంట్ ను కూడా పోలీసులు బయట ప్రదర్శిస్తున్నారు.. ఇటీవల ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి… అందులోనూ ట్రాఫిక్ పోలీసులు డ్యాన్స్ తో అలరించిన వీడియోలను మనం చూస్తున్నాం.. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఓ ఆఫీసర్ డ్యాన్స్ ఇరగదీసాడు.. ఆ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది…
ఆ వీడియోలో ఒక పోలీసు అధికారిప్రైవేట్ ఈవెంట్ లో భాగంగా అదిరిపోయే డ్యాన్స్ చేస్తున్నాడు. కానీ, అతను సివిల్ డ్రెస్ లో ఉన్నాడు. వీడియో చూసిన తర్వాత ప్రతిఒక్కరూ షాక్‌తో నోరెళ్ల బెడుతున్నారు.. అతని స్టెప్పుల ముందు సినీ స్టార్స్ కూడా పనికిరారు.. అంత అద్భుతమైన డ్యాన్స్ ను చేశాడు.. ఫ్రొఫిషనల్ డ్యాన్సర్ లాగా స్టెప్పులు వేసి సోషల్ మీడియా స్టార్ అయ్యాడు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో డ్యాన్స్ చేసిన ఆఫీసర్ పేరు సందీప్ శర్మ.. మధుర సబ్-ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.. తన సోషల్ మీడియాలో ఎప్పుడు వీడియోలను షేర్ చేస్తుంటారు.. ఎక్కువగా డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తాడు.. ఆ వీడియోలకు లైకులు షేర్లు కూడా ఎక్కువగా ఉంటాయి.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్స్ చేశారు.. పోలీసుల డ్యాన్స్ మొదటిసారి చూడటం ఆనందంగా ఉందని మరొక వినియోగదారు రాశాడు. మొత్తానికి వీడియో ట్రెండ్ అవుతుంది.. మీరు ఓ లుక్ వెయ్యండి..