కేరళలోని శబరిమల అయ్యప్ప భక్తులకు పోలీసులు గుడ్‌న్యూస్ చెప్పారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో వార్షిక మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర నవంబర్ 16 నుంచి ప్రారంభమైంది. 41 రోజుల పాటు సాగే ఈ పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తున్నారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేరళ పోలీసులు ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించారు. జిల్లా పోలీసు చీఫ్ వి.జి. వినోద్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు సైబర్ సెల్ ‘శబరిమల – పోలీస్ గైడ్’ పోర్టల్‌ను సిద్ధం చేసింది. ఈ పోర్టల్ ఆంగ్ల భాషలో అందుబాటులో ఉంటుంది.
READ MORE: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
క్విక్ రెస్పాన్స్ (QR) కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా దీన్ని చూడవచ్చు. ఈ పోర్టల్‌లో ఇక్కడికి వచ్చే యాత్రికులకు అవసరమైన అన్ని ముఖ్యమైన సమాచారం పొందుపరిచారు. పోలీసు హెల్ప్‌లైన్ నంబర్లు, పోలీసు స్టేషన్‌ల ఫోన్ నంబర్లు, ఆరోగ్య సేవలు, కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC), అంబులెన్స్, అగ్నిమాపక సేవ, ఆహార భద్రత, దేవస్వోమ్ కార్యాలయ నంబర్లు కూడా పోర్టల్‌లో ఇవ్వబడ్డాయి.
READ MORE:Pushpa 2 : బుక్ మై షోలో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన పుష్ప రాజ్
ఈ ‘గైడ్’ పోర్టల్ ఇక్కడికి వచ్చే యాత్రికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోర్టల్ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శబరిమల పురాణాలు, చరిత్ర గురించి సమాచారాన్ని కూడా పొందుపరిచినట్లు తెలిపారు. అంతే కాకుండా ఇందులో అనేక పండుగలు, ఇరుముడికెట్టు గురించి వివరణాత్మక సమాచారం ఇచ్చారు. శబరిమలకు వాహనాల పార్కింగ్ స్థలాలు, విమాన, రైలు, రోడ్డు మార్గాలు, శబరిమలలో ఉండడానికి స్థలాలు సమాచారం ఉన్నాయి. దర్శన మార్గం గురించి కూడా సమాచారం ఇచ్చారు.