TSPSC Paper Leak Case: ముగ్గురు నిందితులకు కస్టడీ.. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ స్టేట్‌మెంట్ రికార్డు
TSPSC Paper Leak Case: టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారం రోజుకో షాకింగ్ ఇన్ఫర్మేషన్ బయటికొస్తోంది. ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ చైన్ లింక్‌ను ఛేదిస్తోంది సిట్. ఇన్నాళ్లూ ఉద్యోగుల చుట్టూ తిరిగిన కథ మొత్తం ఇప్పుడు పెద్ద తలకాయలను ప్రశ్నించే వరకూ వెళ్లింది. తాజాగా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. ఈ లీకేజీ వ్యవహారంలో ముగ్గురు నిందితులకు నాంపల్లి కోర్టు పోలీస్ కస్టడీ విధించింది, ముగ్గురు నిందితులు ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్యలకు 6 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరినప్పటికీ.. న్యాయస్థానం 3 రోజులకు అంగీకరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డాక్యా, రాజేశ్వర్ నాయక్ నుంచి ప్రశాంత్, రాజేందర్ ఏఈ ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసినట్లు సిట్ విచారణలో తేలింది. ఒక్కొక్కరి నుంచి 10 లక్షల రూపాయల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నట్లు గుర్తించారు. తిరుపతయ్య దళారిగా వ్యవహరించి ఏఈ ప్రశ్నాపత్రం విక్రయించినట్లు తేలింది. ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే ఏఈ ప్రశ్నాపత్రం లీకేజీలో మరికొంత సమాచారం వచ్చే అవకాశముందని సిట్ అధికారులు భావిస్తున్నారు. ప్రశాంత్, రాజేందర్ ఇంకవెరికైనా ప్రశ్నాపత్రాలను విక్రయించారా అనే కోణంలో ప్రశ్నించనున్నారు.
Read Also: Bhatti Vikramarka: కేసీఆర్ తొమ్మిదేళ్లుగా ఒక్క పవర్ ప్రాజెక్ట్ అయినా ఎందుకు కట్టలేదు?
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్‌లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
టీఎస్‌పీఎస్‌సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ను విచారించిన అనంతరం మొత్తం సీనే మారిపోయింది. ప్రశ్నపత్రాలు, ఆన్సర్ షీట్స్ టీఎస్‌పీఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఆధీనంలోనే ఉంటాయని, ఆయన కంప్యూటర్‌లో మాత్రమే నిక్షిప్తం అవుతాయని, బోర్డు సభ్యుల ప్రమేయం ఉండదంటూ అనితా రామచంద్రన్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో సిట్ ఇన్వెస్టిగేషన్ కీలక మలుపు తిరిగింది. అవసరమైతే టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ను కూడా విచారిస్తామన్న సిట్ చేసి చూపించింది. రెండుగంటలపాటు ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డిని ప్రశ్నించి స్టే్‌ట్‌మెంట్ రికార్డు చేసింది. ప్రశ్నపత్రం తయారీ నుంచి వాటిని భద్రపర్చడం, ఎగ్జామ్స్ నిర్వహణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌లో మీ పాత్ర ఏంటంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఛైర్మన్ అనేక ప్రశ్నలను అడిగి సమాధానాలు తెలుసుకున్నారు సిటి అధికారులు. మధ్యాహ్నం 3.30గంటల సమయంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వెళ్లి సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ బృందం… నేరుగా ఛైర్మన్ గదికి వెళ్లారు. దాదాపు 3 గంటల పాటు జనార్దన్ రెడ్డి నుంచి వివరాలు సేకరించారు. టీఎస్‌పీఎస్సీ కార్యకలాపాలు, ఉద్యోగాల నోటిఫికేషన్, ప్రశ్నాపత్రాలు రూపొందించే విధానం, వాటిని భద్రపరిచే తీరు, పరీక్షల నిర్వహణ వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత నెల 11వ తేదీన లీకైన ప్రశ్నాపత్రాలతో పాటు గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఇతర ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ గురించి జనార్దన్ రెడ్డి చెప్పిన వివరాలను సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు. ఇదివరకే టీఎస్ పీఎస్సీ కార్యదర్శి అనితా రాంచంద్రన్, సభ్యుడు లింగారెడ్డి వాంగ్మూలాలను సిట్ అధికారులు ఇది వరకే నమోదు చేసుకున్నారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!