Ganesh Idol: చోరీ కేసులో కోర్టుకు వెళ్లిన వినాయకుడు
- చోరీ కేసులో కోర్టుకు వెళ్లిన వినాయకుడు
- గత నెల 27న చోరీకి గురైన వినాయక విగ్రహ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
- మత్తులో వినాయక విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన గంజాయి బ్యాచ్
- నలుగురు నిందితులపై గతంలో కేసులు ఉన్నట్టు గుర్తింపు
- మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన మెదక్ జిల్లా ASP మహేందర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నెల 27న వినాయక విగ్రహాల తయారీ వద్ద నుంచి కొందరు యువకులు గుట్టుచప్పుడు కాకుండా దొంగతనంగా ఓ ట్రాలీ వాహనంలో వినాయకుడి విగ్రహం పట్టుకెళ్లారు. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలోని చంద్ర భవన్ కాంప్లెక్స్ లో జరిగింది. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడం తో విగ్రహం చోరీ విషయం వెలుగులోకి వచ్చింది.. మెదక్ పట్టణంలోని పిల్లికొట్టల్ వద్ద చంద్ర భవన్ కాంప్లెక్స్ లో సురేష్ ప్రతియేట గణనాధుల విగ్రహాలు తయారు చేసి విక్రయిస్తూ ఉంటాడు. మరికొన్ని రోజుల్లో గణేష్ చతుర్థి రానుండడంతో విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నలుగురు యువకులు అర్ధరాత్రి వేళ ట్రాలీలో గణేష్ విగ్రహాన్ని చోరీ చేసి తీసుకెళ్లారు.
Also Read
- Rohit Sharma Retirement: "దాంతో నాకేం సంబంధం".. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్‌కు రోహిత్ పేరెంట్స్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్‌గూడాలో హైటెన్షన్
తెల్లారి అక్కడికి చేరుకున్న యజమాని విగ్రహం చోరీకి గురైన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి గురైన వినాయక విగ్రహ కేసును పోలీసులు ఛేదించారు. మెదక్ జిల్లా ఏఎస్పీ మహేందర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గంజాయి బ్యాచ్ మత్తులో వినాయక విగ్రహాన్ని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. నలుగురు నిందితులపై గతంలో కేసులు ఉన్నట్టు గుర్తించారు. షాపు ఓనర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులను రిమాండ్ కి తరలించి ట్రాలీ ఆటో, వినాయక విగ్రహాన్ని కోర్టుకు తరలించారు పోలీసులు.
తాజావార్తలు
-
PV Sindhu History: పీవీ సింధు సరికొత్త చరిత్ర.. తొలి భారత షట్లర్‌గా అరుదైన ఘనత!
-
FIFA World Cup 2026 Final: ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల ధరలు ఇవే.. ఒక్క సీటుకి రూ.22 కోట్లా?
-
Rohit Sharma Retirement: “దాంతో నాకేం సంబంధం”.. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!