Police Case: టపాసులు కాల్చిన జేసీ అనుచరులు.. కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Case: తాడిపత్రిలో టపాసులు కాల్చినందుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులపై కేసు నమోదు అయ్యింది.. తాడిపత్రిలో గురువారం రాత్రి కాలేజీ గ్రౌండ్లో టపాసులు పేల్చారు జేసీ అభిమానులు.. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాత్రి తన ఇంటి వద్ద కార్యకర్తలతో మాట్లాడుతుండగా టపాసులు అక్కడికి వచ్చి పడ్డాయట.. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరులు.. దీంతో.. టపాసులు కాల్చవద్దని జేసీ ప్రభాకర్ రెడ్డికి సూచించారు పోలీసులు.. ఇక, జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు మల్లికార్జున రెడ్డితో పాటు మరికొందరిపై 286, 290 r/w 34 ఐపీసీ సెక్షన్లు, 9 (B) (1) (b) ఎక్స్ ప్లోజివ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే, టపాసులు కాల్చినా.. కేసు నమోదు చేయడం ఏంటి? అంటూ జేసీ అనుచరులు, టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.. ఉద్దేశ్యపూర్వకంగానే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫిర్యాదు చేశారని.. తప్పుడు కేసులు తమపై బనాయించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వేధింపులు, కేసులతో తమను అడ్డుకోలేరంటున్నారు.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
తాజావార్తలు
-
Alexander Zverev: జ్వెరెవ్‌కు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో కోబోలీపై విజయం
-
Vastu Tips: బెడ్రూమ్లో అద్దం ఏ దిశలో ఉంటే మంచిది? చాలామంది చేసే ఈ పొరపాటు మీ ఇంట్లో కూడా ఉందా?
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!