Bandi Sanjay: జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్‌కు పోలీసులు అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం బోరబండలో కొనసాగాల్సిన బండి సంజయ్ మీటింగ్‌ను నిలిపేశారు. పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణుల మండిపడుతున్నారు. అనుమతి ఇచ్చి రద్దు చేయడమేంటని బీజేపీ ఎన్నికల ఇంఛార్జీ ధర్మారావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి పోలీసులు తలొగ్గడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం బోరబండలోనే మీటింగ్ జరిపి తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ శ్రేణులంతా భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. బండి సంజయ్ సభకు ఆటంకాలు లేకుండా సహకరించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వెల్లడించారు.
READ MORE: Bihar Elections: కొనసాగుతున్న ఓటింగ్.. ఎంత పోలింగ్ నమోదైందంటే..!
మరోవైపు.. జూబ్లీహిల్స్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. “రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలి చార్మినార్ దగ్గర.. ముస్లిం ల మీద రెండేళ్ళ కింద ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు.. అజారుద్దీన్ కు ఎందుకు సీటు ఇవ్వలేదు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ ఒక మజ్లిస్ తప్ప అన్ని పార్టీలు మారారు.. నేను ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించానో ఒక ఉదాహరణ చెప్పండి.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అనేక సీట్లలో కాంగ్రెస్ ఓడిపోయింది.. 8 పార్లమెంట్ వాళ్ళు గెలిస్తే మేము 8 పార్లమెంట్ గెలిచాం.. ఎమ్మెల్సీ స్థానాలు గెలిచాం.. ఎవరి చేతిలో ప్రజలు లేరు… వాళ్ల ఇష్టం ఉన్న వాళ్లకు వేస్తారు.. రేవంత్ రెడ్డి, కెసిఆర్ చేతుల్లో ఉండరు.. జూబ్లీ హిల్స్ లో మేము గెలుస్తున్నం..” అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.
READ MORE: ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు భయ్యో.. రూ.44,000కుపైగా తగ్గింపుతో Samsung Galaxy Z Flip 6 అందుబాటులో..!
