Bandi Sanjay: జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్‌కు పోలీసులు అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం బోరబండలో కొనసాగాల్సిన బండి సంజయ్ మీటింగ్‌ను నిలిపేశారు. పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణుల మండిపడుతున్నారు. అనుమతి ఇచ్చి రద్దు చేయడమేంటని బీజేపీ ఎన్నికల ఇంఛార్జీ ధర్మారావు ప్రశ్నించారు.