ఐపీఎల్ : ఆన్ లైన్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ మొదలైందంటే చాలు బెట్టింగ్ వీరులు రంగంలో దిగుతారు.. కోట్ల రూపాయలు కొల్లగొడతారు. ఆన్ లైన్ స్వేచ్ఛగా నడుస్తున్న బెట్టింగ్ ని అధికారులు కట్టడి చేయలేక పోతున్నారు. ఎప్పటికప్పుడు సీజన్ వారీగా బెట్టింగ్ మాఫియా ను పట్టుకొని కటకటా ల వెనక్కి నిట్టిన ప్రయోజనం లేకుండా పోతుంది . తాజాగా ఆన్ లైన్ బెట్టింగ్ ముఠా ను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ ఐపిఎల్ బెట్టింగ్ రాకేట్ బయటపడింది. బెట్టింగ్ కు పాల్పడుతున్న 23 మంది బుకీలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ యాప్స్ కేంద్రంగా జరుగుతన్న ఈ బెట్టింగ్ రాకేట్ రెండు తెలుగు రాష్ట్రల్లో లక్షల రూపాయలు కొల్లగొడుతోందని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
కరోనా పరిస్థితుల నుంచి కోలుకుని దుబాయ్ వేదిక జరుగుతున్న ఐపిఎల్ సెకండ్ సీజన్ ను టార్గెట్ చేసుకున్నారు బెట్టింగ్ కేటుగాళ్లు. భారీ ఎత్తున్న బెట్టింగ్ కు పాల్పడుతున్న బుకీలను మాటు వేసి పట్టుకున్నారు మాదాపూర్ ఎస్వోటి పోలీసులు. పక్కా సమాచారంతో మాదాపూర్ మియాపూర్, బాచుపల్లి, గచ్చిబౌలి, మైలార్‌దేవ్‌పల్లితో పాటు ఏడు చోట్ల దాడులు నిర్వహించాగా.. 23 మంది బుకీలను అరెస్టు చేశారు. వారి వద్ద రూ.93 లక్షలు నగదు సీజ్ చేశారు పోలీసులు. అంతే కాకుండా మొత్తం రూ.2.2 కోట్ల విలువ చేసే బెట్టింగ్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
- INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
గూగుల్‌లో ఉన్న మొబైల్ యాప్‌తో ఈ ముఠా బెట్టింట్కు పాల్పడుతోంది. మొత్తం బెట్టింగ్‌ను నాలుగు లేయర్స్‌లో నిర్వహిస్తున్నారు. మెయిన్ బుకీకి అనుసంధానంగా మరో ముగ్గురు పని చేస్తారు. మొబైల్ యాప్స్ నుంచి సమాచారం తీసుకుని బెట్టింగ్ జరుపుతున్నారు. ముంబై, గోవా, దుబాయ్‌లలో వీరికి నెట్వర్క్ ఉన్నట్లు గుర్తించారు. విజయవాడకు చెందిన మహా అనే వ్యక్తి మెయిన్ బుకీగా ఉన్నాడు.. అయితే బెట్టింగ్ కు సహకరించే ఆన్ లైన్ యాప్స్ ఫాన్సీ లైఫ్ ఎంటర్టైన్మెంట్ యాప్ , లైవ్ లైన్ గురు, క్రికెట్ మజా, లోటస్ బెట్ 365, బెట్ ఫెయిర్ యాప్ ల ను నిషేదించెలా గూగల్ కు లేఖ రాస్తామని సైబారాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అలాగే బెట్టింగ్ నిర్వహిస్తూ చాలా మంది అప్పుల పాలవుతున్న నేపథ్యంలో పిల్లల ఫోన్లపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి” అని సీపీ ప్రజలకు సూచించారు.
— Ramesh Vaitla
తాజావార్తలు
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!