బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎడమ చేతికి గాయం అయింది. పోలీసులు వెహికిల్ లోకి ఎక్కిస్తున్న సమయంలో హరీష్ రావుకు గాయమైంది. కాగా.. పలువురు బీఆర్ఎస్ నేతలను సైబరాబాద్ పీఎస్ నుంచి కేశంపేట పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. బీఆర్ఎస్ నేతలను వాహనాలలో తరలిస్తున్న సమయంలో పలు చోట్ల బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ నేతలు ఉన్న వాహనం పీఎస్ వద్దకు రాగానే నేతలంతా ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో.. వారి మధ్య నుంచి హరీష్ రావు నొప్పితో బాధ పడుతూ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
Read Also: Supreme court: ‘‘ బుల్డోజర్ న్యాయం ‘‘పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
అంతకుముందు.. సైబరాబాద్ సీపీ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో.. బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. హరీష్‌రావుతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు.. అరికెపూడీ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన బీఆర్‌ఎస్ నేతలను కేశంపేట పీఎస్‌కు తీసుకొచ్చారు.
Read Also: Kondapalli Srinivas: యువకులకు గుడ్ న్యూస్.. పారిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వ సాయం
