బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎడమ చేతికి గాయం అయింది. పోలీసులు వెహికిల్ లోకి ఎక్కిస్తున్న సమయంలో హరీష్ రావుకు గాయమైంది. కాగా.. పలువురు బీఆర్ఎస్ నేతలను సైబరాబాద్ పీఎస్ నుంచి కేశంపేట పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. బీఆర్ఎస్ నేతలను వాహనాలలో తరలిస్తున్న సమయంలో పలు చోట్ల బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు.