Bichagadu : అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు అన్నట్లుంది బిచ్చగాళ్ల పరిస్థితి. గతిలేక అడుక్కుంటుంటే అధికారులు ఇప్పుడు వారిని అడ్డుకుంటున్నారు. మరోసారి రోడ్లపై కనిపిస్తే కేసులు పెట్టి జైల్లో పెడతామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు వారి దయనీయ పరిస్థితి చూసి జీవనోపాధి కల్పించాల్సింది పోయి.. వారి వృత్తికి గండి కొడుతున్నారు. ఈ మధ్యకాలంలో నాగపూర్ యాచకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై రోడ్లపై అడుక్కుంటే అడ్డంగా బుక్ చేసి కేసులు పెట్టి జైల్లో పెడతామన్నారు.
Read Also: Pakistan: పాకిస్తాన్‌కు హోండా గుడ్ బై.. కుదేలైన పాక్ ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ
కారణం, ప్రస్తుతం రాష్ట్ర ఉప రాజధానిలో యాచకుల ఆగడాలు పెరిగిపోయాయి. దీనికి వ్యతిరేకంగా పౌరులు పదే పదే ప్రభుత్వం, పరిపాలన అధికారులకు కంప్లైట్లు చేశారు. కానీ, ఇప్పటి వరకు బిచ్చగాళ్లపై నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు వారు రంగంలోకి దిగారు. ఇకపై నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్ల పక్కనే కాకుండా ముఖ్యమైన బహిరంగ ప్రదేశాల్లో నిలబడి అడుక్కోవడం సాధ్యం కాదు. ఈ బిచ్చగాళ్లపై నాగ్‌పూర్ పోలీసులు స్పెషల్ రైడ్స్ ప్రారంభించారు. చౌరస్తాల్లో బిచ్చగాళ్లపై కేసు నమోదు చేయాలని పోలీసు కమిషనర్ అమితేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జీ-20 నేపథ్యంలో పోలీస్ కమిషనర్ ఈ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే చాలా మంది యాచకులను నగరం నుంచి తరిమికొట్టారు. అయితే చౌరస్తాల్లో జరుగుతున్న ఇబ్బందులను అదుపులోకి తెచ్చేందుకు వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.