NTV Telugu Site icon

PM Modi: తెలంగాణ ప్రజలు ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు..

Pm Modi

Pm Modi

PM Modi: తెలంగాణ బీజేపీ పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో ఎలా అమలు జరుగుతున్నాయనే దానిపై ప్రధాని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర పథకాలను సమగ్రంగా అమలు చేసేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు పని చెయ్యాలని దిశా నిర్దేశం చేశారు. సమావేశం అనంతరం ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

Read Also: Minister Seethakka: నిర్మల్ ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.. ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీ శాసనసభ్యులతో, ఎంపీలతో చాలా మంచి సమావేశం జరిగిందని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఉనికి వేగంగా విస్తరిస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారని.. అంతేకాక బీఆర్‌ఎస్ దుష్టపాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారని ప్రధాని అన్నారు. తెలంగాణ ప్రజలు ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భాజపా తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుందన్నారు. మా కార్యకర్తలు మా అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉంటారని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.