Katchatheevu issue: కచ్చతీవు ద్వీపం అంశం మరోసారి వార్తల్లోకెక్కింది. ఇప్పుడు ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. దీని వల్ల శ్రీలంకతో భారత్ సంబంధాలు మరింత దిగజారే ప్రమాదం ఉందని సీనియర్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. పొరుగు దేశానికి భయాందోళనలు సృష్టించినందుకు ఆయన (ప్రధాని) వెంటనే క్షమాపణ చెబుతారా అంటూ ప్రశ్నించారు. ఈ అంశాన్ని ప్రధాని లేవనెత్తడం చాలా బాధ్యతారాహిత్యమని విమర్శలు గుప్పించారు. ఇక, ఆదివారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే హాజరయ్యారని జైరాం రమేష్ తన ట్విట్టర్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
Read Also: Pushpa 2 : రికార్డు స్థాయిలో పుష్ప 2 నైజాం రైట్స్..?
ఇక, తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి మద్దతునిచ్చేందుకు ‘మూడోసారి ప్రధాని’ అయేందుకు ఎన్నికల ప్రచారంలో తన సహచరులు తయారు చేసిన స్ర్కిప్టే కచ్చతీవు సమస్య అని కాంగ్రెస్ నేత జైరాం రామేష్ తెలిపారు. దీని వల్ల శ్రీలంకతో మన దేశానికి ఉన్న సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఉందని అన్నారు. దీనికి తమిళనాడు ప్రజలు తగిన సమాధానం చెప్పారని పేర్కొన్నారు. కాంగ్రెస్ మాజీ ప్రధానులు కచ్చతీవు ద్వీపం పట్ల ఉదాసీనత ప్రదర్శించారు.. చట్టపరమైన విధానానికి వ్యతిరేకంగా భారతీయ మత్స్యకారుల హక్కులను హరించారని మోడీ ఆరోపణలను తప్పుబట్టారు. కచ్చతీవు ద్వీపాన్ని బూచీగా చూపించి తమిళనాడులో పాగా వేసేందుకు నరేంద్ర మోడీ కుట్ర చేశారని జైరాం రమేష్ వెల్లడించారు.