Cyclone Biparjoy: ప్రధాని మోడీ హైలెవల్ మీటింగ్.. బిపర్జోయ్ తుఫాన్‌ను ఎదుర్కొనే దానిపై సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Biparjoy: తూర్పు మధ్య అరేబియా సముద్రంలో బిపర్జోయ్ తుఫాను తీవ్ర తుపానుగా మారింది. గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్న ఈ తుఫాను గుజరాత్ లోని పోర్ బందర్ కు నైరుతి దిశగా 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. జూన్ 15న కచ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ క్రమంలో తుఫాన్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వ సన్నద్ధతను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు తుఫాను పరిస్థితి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించారు. ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా తరలించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ప్రధాని ఆదేశించారు. విద్యుత్, టెలికమ్యూనికేషన్స్, ఆరోగ్యం, తాగునీరు వంటి అన్ని అత్యవసర సేవల నిర్వహణ ఉండేలా చూడాలని కోరారు.
Read Also: Viral News: తాగితే లోకమే మరిచిపోతారా.. తాగిన మత్తులో.. అలా చేశాడు..!
Also Read
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ ఎం రవిచంద్రన్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శి కమల్ కిషోర్, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ హాజరయ్యారు. తుఫాను తీవ్రత పెరిగితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజా భద్రతకు భరోసా కల్పించాలని ప్రధాని మోడీ ఆదేశించారు. తుఫాను దృష్ట్యా అధికారులు సముద్ర తీరాల జిల్లాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంతేకాకుండా గుజరాత్ దక్షిణ, ఉత్తర తీరాల్లో చేపల వేట కార్యకలాపాలను నిలిపివేశారు.
Read Also:
ఇప్పటివరకు 1,300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తీరప్రాంత ద్వారకా అధికారులు తెలిపారు. సౌరాష్ట్ర-కచ్ ప్రాంతాల్లో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు స్థానిక యంత్రాంగం కృషి చేస్తుండటంతో కచ్ జిల్లాలోని తీర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. మత్స్యకారులు ఈ నెల 15 వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని తీరప్రాంతాల్లో హెచ్చరికలు పంపారు. మరోవైపు సముద్రంలో ఉన్న మత్స్యకారులు తీరానికి తిరిగి రావాలని సూచించారు. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించాలనీ, కచ్, దేవభూమి ద్వారకా, పోరుబందరు, జామ్ నగర్, రాజ్ కోట్, జునాగఢ్, మోర్బి జిల్లాలతో సహా సౌరాష్ట్ర, కచ్ తీర ప్రాంతాల నుండి తరలింపును సమీకరించాలని కేంద్రం గుజరాత్ ప్రభుత్వాన్ని కోరింది.
తాజావార్తలు
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..