PM Modi :ఈరోజు సాయంత్రం సినిమా చూడనున్న ప్రధాని మోడీ.. మూవీ పేరేంటంటే?
- ఈరోజు సాయంత్రం ఢిల్లీలో సినిమా చూడనున్న మోడీ
- న్యూఢిల్లీలోని బాలయోగి ఆడిటోరియంలో మూవీ వీక్షణ
- గోద్రా ఘటన ఆధారంగా తీసిన చిత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు సోమవారం సాయంత్రం 4 గంటలకు ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని వీక్షించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటించారు. గుజరాత్‌లోని గోద్రా ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. న్యూఢిల్లీలోని బాలయోగి ఆడిటోరియంలో ప్రధానమంత్రి ఈ చిత్రాన్ని వీక్షిస్తారు.
READ MORE: Tiger Search Operation: కొమురం భీం జిల్లా అడవుల్లో పులి టెర్రర్.. టైగర్ కోసం సెర్చ్ ఆపరేషన్
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ది సబర్మతి రిపోర్ట్ చిత్రం గత నెల నవంబర్ 15న థియేటర్లలో విడుదలైంది. గోద్రా రైలు దుర్ఘటనపై ఆ తర్వాత చెలరేగిన అల్లర్ల ఆధారంగ తెరకెక్కిన ‘‘ది సబర్మతీ రిపోర్ట్’’ సినిమాపై ప్రధాని నరేంద్రమోడీ గతంలో ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటన వెనక ఉన్న నిజాన్ని వెల్లడించినందుకు చిత్రాన్ని కొనియాడారు. ‘‘నకిలీ కథనం పరిమిత కాలం మాత్రమే కొనసాగుతుంది’’ అని మోడీ అన్నారు. ఈ నిజం బయటకు రావడం మంచిదని కొనియాడారు.
READ MORE: Tiger Search Operation: కొమురం భీం జిల్లా అడవుల్లో పులి టెర్రర్.. టైగర్ కోసం సెర్చ్ ఆపరేషన్
అసలు ఏంటి ఈ గోద్రా విషాదం?
ఫిబ్రవరి 27, 2002 ఉదయం సబర్మతి ఎక్స్‌ప్రెస్ గుజరాత్‌లోని గోద్రా రైల్వే స్టేషన్‌కి వచ్చింది. బీహార్‌లోని ముజఫర్ పూర్ నుంచి గుజరాత్‌లో అహ్మదాబాద్ వరకు నడుస్తున్న ఈ రైలులో వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ రైలులోనే అయోధ్యలో మతపరమైన సమావేశం నుంచి తిరిగి వస్తున్న కరసేవకులు ఉన్నారు. రైలు గోద్రా నుంచి బయలుదేరే సమయంలో ఎమర్జెన్సీ చైన్‌ని చాలా సార్లు లాగినట్లు డ్రైవర్ తెలిపారు.
READ MORE: Banana Taped To Wall Art: రూ.52 కోట్ల విలువైన అరటి పండును.. గుటుక్కున మింగేశాడు(వీడియో)
దీనివల్ల స్టేషన్ వెలువలి సిగ్నల్ వద్ద రైలు ఆగిపోయింది. ఆ తర్వాత భారీ దాడి జరిగింది. 2000 మంది వ్యక్తుల గుంపు రైలుపై రాళ్లను రువ్వారు. నాలుగు కోచ్‌లను తగలబెట్టారు. S-6 కోచ్ ఎక్కువగా ప్రభావితమైంది మరియు అగ్నిప్రమాదంలో 27 మంది మహిళలు మరియు 10 మంది పిల్లలు సహా 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరో 48 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గోద్రా తర్వాత గుజరాత్ అంతటా అల్లర్లు జరిగాయి. తీవ్రమైన మతకలహాల్లో హిందువులు, ముస్లింలు చనిపోయారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!