Site icon NTV Telugu

PM Modi: లొంగిపోండి లేదంటే వదిలిపెట్టం.. టీఎంసీ గుండాలకు మోడీ ఫైనల్ వార్నింగ్..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం బెంగాల్ ప్రచారంలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో.. గుండాలు, సిండికేట్‌లకు ఇదే చివరి వార్నింగ్ అంటూ హెచ్చరించారు. బిష్ణుపూర్‌లో జరిగిన బీజేపీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘టీఎంసీ గుండాలు, సిండికేట్లు, అవినీతిపరులందరికి చివరి అవకాశం ఇస్తున్నాను. ఏప్రిల్ 29లోపు మీరు మీకు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో లొంగిపోండి. మే 4 తర్వాత ఎవరినీ వదిలిపెట్టేది లేదు. బిష్ణుపూర్ మాఫియా, టీఎంసీ సిండికేట్ జాగ్రత్తగా వినండి. దీనిని ఇకపై సహించేది లేదు’’ అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

Read Also: Mercedes Buried: అదృష్టం కోసం ‘8888’ నంబర్ ప్లేట్.. మృతదేహంతో పాటు రూ.1.5 కోట్ల బెంజ్ కారును పాతిపెట్టిన ఫ్యామిలీ!

రాష్ట్రంలో మహిళా ఓటర్లే లక్ష్యంగా ప్రధాని హామీలు ఇచ్చారు. బెంగాల్‌తో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత రేషన్, మాతృశక్తి భరోసా కార్డ్ ద్వారా ఏడాదికి రూ. 36,000 అందిస్తామని ఆయన చెప్పారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్‌ను ఎవరూ దొంగిలించలేరని అన్నారు. పొరుగున ఉన్న అస్సాం, త్రిపుర, ఒడిశా, బీహార్‌లో మహిళలకు అందుతున్న పథకాలు, బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం వల్ల లభించడం లేదని చెప్పారు. పీఎం ఆవాస్ యోజన కింద మహిళలకు శాశ్వత ఇళ్ల కోసం రూ. 1.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు.

మమతా బెనర్జీ సర్కార్‌కు బెంగాల్ మహిళలు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ మహిళల్ని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీలలో రెండు దశల్లో జరగనున్నాయి, ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టనున్నారు. మమతా బెనర్జీ వరుసగా నాలుగోసారి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తుండగా, బీజేపీ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది.

Exit mobile version