PM Modi: మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించనున్నారు. జనవరి 8న ప్రధాని మోడీ ఏపీ పర్యటనకు రానున్నారు. రూ. 85 వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశాఖ రైల్వే జోన్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ నిర్మించే ఏపీ జెన్కో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. నవంబరులో జరగాల్సిన ప్రధాని పర్యటన తుఫాన్ కారణంగా వాయిదా పడడంతో శంకుస్థాపనలు నిలిచిపోయాయి.
Read Also: PM Modi: బీజేపీ ప్రభుత్వాల అభివృద్ధిని ఇతరుల పాలనతో పోల్చొద్దు
తాజాగా జనవరి 8న ప్రధాని మోడీ అనకాపల్లి జిల్లా పర్యటన ఖరారైంది. ప్రధాని పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి లోకేష్‌తో పాటు, అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ పర్యవేక్షిస్తున్నారు. శంకుస్థాపనల కార్యక్రమంలో ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం మండలంలో పూడిమడకలో ఎన్టిపిసి నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్‌తో పాటు, మరికొన్ని ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు చేయనున్నారు. సుమారు రూ.85 వేల కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. విశాఖను గ్రోత్ హబ్‌గా కేంద్రం ప్రకటించింది.
Read Also: CM Chandrababu: ప్రధాని మోడీ, రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు భేటీ
ఇదిలా ఉండగా.. ఏపీ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని సహా కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తు్న్నారు. ప్రధాని మోడీతో సీఎం సమావేశమయ్యారు. పలు అంశాలను చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఏపీ పర్యటనకు రావాలని ప్రధాని మోడీని స్వయంగా ఆహ్వానించినట్లు సమాచారం.