మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించనున్నారు. జనవరి 8న ప్రధాని మోడీ ఏపీ పర్యటనకు రానున్నారు. రూ. 85 వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశాఖ రైల్వే జోన్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.