Site icon NTV Telugu

NDA: రేపు ఎన్డీయే ముఖ్యమంత్రుల, ఉపముఖ్యమంత్రుల సమావేశం.. కీలక అంశాలపై చర్చ..!

Pm Modi

Pm Modi

రేపు ఎన్డీయే ముఖ్యమంత్రుల, ఉపముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ప్రధాని అధ్యక్షతన జరగనున్న ఎన్డీయే సమావేశం నిర్వహించనున్నారు. సుపరిపాలన, ఉత్తమ పద్ధతులపై ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలు చర్చించనున్నారు. సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. రేపటి సమావేశంలో ఎన్డీయే రాష్ట్రాల నుంచి 20 మంది ముఖ్యమంత్రులు, 18 మంది ఉపముఖ్యమంత్రులు హాజరవుతారు. రేపటి ఎన్డీయే సమావేశం లో రెండు తీర్మానాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

READ MORE: Off The Record : యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి ఏర్పాటుకు ఎందుకు ముందడుగు పడటంలేదు?

ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయినందుకు భారత రక్షణ దళాలు, ప్రధానమంత్రిని అభినందించనున్నారు. జనాభా లెక్కింపులో కుల గణన నిర్వహించాలనే కేంద్ర నిర్ణయాన్ని ఎన్డీయే ముఖ్యమంత్రులు అభినందించనున్నారు. సమావేశంలో ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తమ పద్ధతులపై చర్చ జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వ తొలి వార్షికోత్సవం.. అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్దం పూర్తి, అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన 50వ లోక్‌తంత్ర హత్య దివస్ వంటి రాబోయే కార్యక్రమాలపై చర్చ జరగనుంది.

READ MORE: Off The Record : మినీ మహానాడు కార్యక్రమంలో బండారు సత్యనారాయణ పార్టీని నిలదీశారా..?

కాగా.. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, భారతదేశం అభివృద్ధి చెందడం ప్రతి భారతీయుడి కల అని అన్నారు. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇది 140 కోట్ల మంది దేశప్రజల ఆకాంక్ష. మనం అభివృద్ధి వేగాన్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం, అన్ని రాష్ట్రాలు టీమిండియా లాగా కలిసి పనిచేస్తే, ఏ లక్ష్యం అసాధ్యం కాదన్నారు ప్రధాని మోడీ.

Exit mobile version