PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ-జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ.
- సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతతే సంబంధాల అభివృద్ధికి ప్రాతిపదిక అన్న మోదీ.
- ఇప్పటికే ఉన్న సరిహద్దు ఒప్పందాలు, అవగాహనలను పాటించాలని సూచన.
- “భేదాలు వివాదాలుగా మారకూడదు” అని స్పష్టం చేసిన ప్రధాని.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ భారతదేశానికి వచ్చారు. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో భారత్-చైనా సంబంధాల అభివృద్ధికి సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత అత్యంత కీలకమని మోడీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒప్పందాలను, అవగాహనను ఇరు పక్షాలు పాటించాలని సూచించారు. ద్వైపాక్షిక సంబంధాలు , పెట్టుబడులు, వాణిజ్యంపై ఇరువురు నేతలు చర్చించారు.
సమావేశం తర్వాత భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. గతేడాది ఆగస్టులో టియాంజిన్‌లో మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత భారత్-చైనా సంబంధాల్లో చోటుచేసుకున్న పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారని చెప్పారు. పరస్పర గౌరవం. పరస్పర సున్నితత్వం, పరస్పర ప్రయోజనం అనే మూడు అంశాల ఆధారంగా ద్వైపాక్షిక సహకారాన్ని కొనసాగించాలని ఇరువురు నేతలు పునరుద్ఘాటించినట్లు ఆయన వెల్లడించారు.
Also Read
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
- BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
- Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
ఇదే సమయంలో, భారత్-చైనా మధ్య విభేదాలు వివాదాలుగా మారకుండా చూడాల్సిన బాధ్యత ఉందని మోడీ జిన్‌పింగ్‌కు స్పష్టం చేశారు. సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత కొనసాగించడం ద్వైపాక్షిక సంబంధాల నిరంతర అభివృద్ధికి ప్రాథమిక ఆధారం అని ప్రధాని చెప్పినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. మరోవైపు, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సానుకూల వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు ఒకరి బలాల నుంచి మరొకరు నేర్చుకుని, సహకరించుకోవాలని అన్నారు.
ఇదిలా ఉంటే, సాధారణ సంబంధాల నుంచి సరిహద్దు వివాదాన్ని వేరుగా చూడాలని చైనా వైఖరి. అయితే, భారత్ మాత్రం సరిహద్దుల్లో శాంతి, ప్రశాంత లేకుండా ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి సాధ్యం కాదని చెబుతోంది. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ మధ్య ప్రత్యేక ప్రతినిదుల స్థాయి చర్చలు జరిగాయి. ఎల్ఏసీ వెంబడి శాంతి కొనసాగించాల్సిన అవసరాన్ని భారత్ నొక్కి చెప్పింది. 2003లో ఏర్పాటైన ఈ వ్యవస్థ ద్వారా 3,488 కిలోమీటర్ల సరిహద్దు వివాదానికి పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
-
WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
-
Zomato: ఫుడ్ లవర్స్‌కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
-
Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్నా? పొంగులేటి ఫైర్
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!