Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్నా? పొంగులేటి ఫైర్
- రాజీనామా డిమాండ్‌పై పొంగులేటి ఘాటు కౌంటర్
- కేసీఆర్ రాజీనామా చేయాలా అంటూ హరీశ్‌రావుకు ప్రశ్న
- అధికారంలో అవినీతి.. ప్రతిపక్షంలో బ్లాక్మెయిల్ అంటూ ఫైర్
- ‘పొంగులేటి.. పొంగు’ వ్యాఖ్యలపై మంత్రి వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో 22ఏ భూముల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి హరీశ్‌రావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజీనామా చేయాలని తనను డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష నేతలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రజల కోసం పనిచేస్తున్న తనను రాజీనామా చేయాలని అడగడం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకుండా ఫామ్‌హౌస్‌లో ఉంటున్న కేసీఆర్ రాజీనామా చేయాలా? అని హరీశ్‌రావును నిలదీశారు.
తాను ప్రతి నెల కేవలం రూపాయి జీతం తీసుకుంటూ పేదల కోసం పనిచేస్తున్నానని పొంగులేటి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ టవర్స్ నిర్మాణంతో పాటు ప్రజల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే అసత్య ప్రచారాలతో బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. వారి బెదిరింపులకు భయపడే ప్రభుత్వం ఇది కాదని స్పష్టం చేశారు.
Also Read
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
తన పేరును ప్రస్తావిస్తూ ‘పొంగులేటి.. పొంగు’ అంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపైనా మంత్రి ఘాటుగా స్పందించారు. ‘పొంగులేటి.. పొంగు’ అని ఎందుకు పదేపదే అంటున్నారని ప్రశ్నించారు. శుభకార్యంలో పాలు పొంగితే శుభమని, గోదావరి, కృష్ణా నదులు ఉగ్రరూపంలో పొంగితే ఆ ప్రవాహంలో మీరే కాదు.. మీ పార్టీ కూడా నామరూపాలు లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇందిరమ్మ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!