Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- బంగ్లాదేశ్‌లో కస్టడీలో ఉన్న చిన్మయ్ కృష్ణదాస్‌పై సువేందు అధికారి వ్యాఖ్యలు.
- తల్లి అంత్యక్రియల సమయంలో చిన్మయ్ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు వైరల్.
- ఆ దృశ్యాలు సనాతనవాదులను కదిలించాయని అధికారి వ్యాఖ్య.
- బెంగాల్ విభజన గురించి ప్రస్తావన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suvendu Adhikari: బంగ్లాదేశ్ కస్టడీలో ఉన్న హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణదాస్ అంశాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి ప్రస్తావించారు. చిన్మోయ్ తన తల్లి అంత్యక్రియలకు హాజరైన సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులు పడుతున్న కష్టాలను ఈ కన్నీళ్లు చెబుతున్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం కేవలం 5 గంటల పెరోల్ ఇచ్చి, తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతించింది.
ఇదిలా ఉంటే, ఈ అంశంపై సువేందు అధికారి మట్లాడుతూ.. తన తల్లి అంత్యక్రియలకు హాజరైన సమయంలో చిన్మోయ్ కృష్ణదాస్ పెట్టుకున్న కన్నీళ్లు ప్రపంచవ్యాప్తంగా సనాతనవాదుల్ని కదిలించాని అన్నారు. బెంగాల్ విభజన, హిందువుల భద్రతకు సంబంధించిన చారిత్రక అంశాలను అధికారి ప్రస్తావించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ, స్వామి ప్రణవానంద వంటి నేతల పోరాటం వల్ల బెంగాల్లో కొంత భాగం భారత్‌లో విలీనం అయిందని అన్నారు. ఒక వేళ విలీనం కాకపోయి ఉంటే, ఈ రోజు మన పరిస్థితి కూడా చిన్మోయ్ కృష్ణదాస్ పరిస్థితి లాగే ఉండేదని అన్నారు.
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
తన కుటుంబం బెంగాల్ విభజన సమయంలో ఎదుర్కొన్న పరిస్థితుల్ని సువేందు అధికారి వెల్లడించారు. తన తల్లి గాయత్రీ దేవీ కుటుంబం ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉండేదని, దేశ విభజన సమయంలో హిందువులు కావడం వల్ల తమ తల్లి, తాత భారత్‌కు వలస రావాల్సి వచ్చిందని అన్నారు. కట్టుబట్టలతో తన తల్లి, అన్నింటిని వదిలేసి మా నాన్నతో పారిపోయి రావాల్సి వచ్చిందని అన్నారు.
బెంగాలీ హిందువుల కోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ, స్వామి ప్రణవానంద చేసిన కృషిని వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా ప్రజలు మరిచిపోయేలా చేశాయని సువేందు ఆరోపించారు. బెంగాల్ సంస్కృతిని దూరం చేసిందని అన్నారు. దుర్గాపూజ, మహాలయ వంటి సంప్రదాయాల విషయంలో ఇదే తరహా సిద్ధాంతపరమైన వైఖరిని అవలంభించాయని ఆరోపించారు. టీఎంసీ తన పాలనలో బెంగాల్‌ను ‘‘జమాతీకరించేందుకు’’ ప్రయత్నించిందని అన్నారు.
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!