Zomato: ఫుడ్ లవర్స్‌కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zomato: ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే నెటిజన్ల జేబులకు చిల్లు పెట్టే సరికొత్త ఎత్తుగడకు ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో (Zomato) శ్రీకారం చుట్టింది. ఇప్పటికే డెలివరీ ఛార్జీలు, రెస్టారెంట్ ప్యాకేజింగ్ ఫీజులు, ప్లాట్‌ఫామ్ ఫీజులు, జీఎస్టీల పేరుతో వినియోగదారులను పిండేస్తున్న కంపెనీ.. ఇప్పుడు ఏకంగా నగదు చెల్లింపులపై కూడా పన్ను మోత మొదలుపెట్టింది. క్యాష్-ఆన్-డెలివరీ ఆర్డర్ (COD) చేసే కస్టమర్లపై ప్రత్యేకంగా అదనపు బాదుడు విధించడం మొదలుపెట్టి షాక్ ఇచ్చింది. సాధారణంగా ఆన్లైన్ మోసాలకు భయపడో, ముందస్తు చెల్లింపులు ఇష్టం లేకో చాలామంది క్యాష్-ఆన్-డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకుంటారు. అయితే ఇకపై ఇలా ఆర్డర్ చేసే వారి బిల్లుల్లో “పే ఆన్ డెలివరీ ఫీజు” పేరిట సరికొత్త ఛార్జీని జొమాటో యాడ్ చేస్తోంది. ఆర్డర్ విలువ, యూజర్, లోకేషన్‌ను బట్టి ఈ ఛార్జీ ఒక్కో చోట ఒక్కోలా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. అయితే తీవ్రమైన పోటీ ఉన్న స్విగ్గీ వంటి సంస్థలు ఇప్పటికీ సీవోడీపై ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయకపోవడం గమనార్హం.
చిన్న రుసుము.. వందల కోట్ల లాభం
కస్టమర్ దృష్టిలో చూస్తే ఒక్క ఆర్డర్‌పై రూ.5 లేదా రూ.10 పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు. కానీ జొమాటో సామ్రాజ్యం ముందు ఈ చిన్న మొత్తం కళ్లు చెదిరే లాభాలను తీసుకొస్తుంది. గణాంకాల ప్రకారం జొమాటో ప్రతిరోజూ దాదాపు 23 లక్షల నుంచి 25 లక్షల ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేస్తోంది. ఒకవేళ కేవలం ప్రతి ఆర్డర్‌పై రూ.5 అదనంగా వసూలు చేసినా.. సంస్థ ఖాతాలోకి రోజూ దాదాపు రూ.1.25 కోట్లు, ఏడాదికి సుమారు రూ.450 కోట్లకు పైగా అదనపు ఆదాయం వచ్చి పడుతుంది. ఈ సంఖ్యే ఈ మైక్రో-ఛార్జీల వెనుక దాగి ఉన్న అసలు సూత్రమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
రూ.2తో మొదలై రూ.15కు చేరిన ప్లాట్‌ఫామ్ దోపిడీ
ఫుడ్ యాప్‌లు యూజర్లను ఎలా అలవాటు చేసి బాదుతాయో ప్లాట్‌ఫామ్ ఫీజు ప్రస్థానాన్ని చూస్తే అర్థమవుతుందని అంటున్నారు. 2023 ఏప్రిల్‌లో కేవలం రూ.2 నామమాత్రపు ఫీజుతో మొదలైన ఈ దోపిడీ.. ఇప్పుడు ఆర్డర్‌కు రూ.14.99 (జీఎస్టీ అదనం) వరకు చేరింది. ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు కేవలం ఈ ప్లాట్‌ఫామ్ ఫీజుల ద్వారానే ఏడాదికి దాదాపు రూ.3,500 నుంచి రూ.4,000 కోట్ల భారీ ఆదాయాన్ని పిండుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా పేమెంట్ మోడ్‌పై కూడా ఫీజు వేయడంతో ఫుడ్ బిల్లుల జాబితా చాంతాడంత పొడవుగా తయారవుతోంది. తిండి ఖర్చు పక్కన పెడితే ప్యాకేజింగ్, డెలివరీ, ప్లాట్‌ఫామ్, పేమెంట్, ట్యాక్స్ అంటూ అన్ని రకాల ఛార్జీలతో తయ నెత్తిన పెద్ద బండ వేస్తున్నారని యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!