NTV Telugu Site icon

Viral Video: అవిశ్వాస తీర్మానాన్ని ఆనాడే ఊహించిన మోడీ.. 2019 నాటి వీడియో వైరల్

Pm Modi

Pm Modi

PM Modi predicted no-trust motion in 2023 in 2019 speech, Video Goes Viral: కేంద్రంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ ప్రతిపక్షాలు బుధవారం నోటీసులు ఇవ్వగా, ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రధాని మోడీ నాలుగేళ్ల క్రితమే ఊహించారు. 2019లో అలాంటి తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇచ్చిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ దీని గురించి ప్రస్తావించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘2023లో మళ్లీ అవిశ్వాసం పెట్టే అవకాశం వచ్చేలా మీరు ఎంతగానో సిద్ధం కావాలని నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను’’ అని మోడీ అనడంతో అధికార పక్ష సభ్యులు నవ్వులు చిందించారు. 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని ఎద్దేవా చేస్తూ నాడు మోదీ ఇలా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

Also Read: No Confidence Motion: ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. ఆమోదించిన లోక్‌సభ స్పీకర్

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మోడీ ప్రసంగంలోని ఈ భాగాన్ని ఆయన “అంచనా” హైలైట్ చేయడానికి పంచుకున్నారు. అహంకారం వల్ల 2014 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ సంఖ్య ఒకేసారి 400 నుండి దాదాపు 40కి పడిపోయిందని ప్రధాని మోడీ ఆ సమయంలో అన్నారు. అహంకారం వల్ల జరిగిన పరిణామం అది అని ఆయన పేర్కొన్నారు. సేవాభావం వల్లే బీజేపీ రెండు స్థానాల నుంచి ఒంటరిగా అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదిగిందని మోడీ ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని వ్యాఖ్యలు చేసిన సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా ఉన్నారు.

తాజాగా మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) బుధవారం నోటీసులు సమర్పించాయి. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. స్పీకర్ ఇప్పుడు చర్చ తేదీని త్వరలో ప్రకటిస్తారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ డిప్యూటీ లీడర్‌ గౌరవ్‌ గొగోయ్‌ లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ కార్యాలయానికి నోటీసు ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం కోసం ప్రత్యేక నోటీసును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఫ్లోర్ లీడర్ నాగేశ్వర్ రావు స్పీకర్‌కు సమర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ ఉన్న సంగతి తెలిసిందే.