“మన్ కీ బాత్” లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోడీ ప్రస్తావించారు. “డ్రోన్ దీదీలు” తెలంగాణలో వ్యవసాయంలో పెను మార్పులు తీసుకొస్తున్నారని వెల్లడించారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా మహిళలు డ్రోన్లతో వ్యవసాయం చేయడాన్ని మోడీ ప్రశంసించారు. “గ్రామీణ మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగా శిక్షణ పొందారు. పండ్ల తోటలకు పురుగుమందులు, శీల్దార పిచికారీ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. సాంప్రదాయ పద్ధతులకంటే వేగంగా, సమర్థవంతంగా పురుగుమందులను పిచికారీ చేయవచ్చు. నీటిని, మందుల వినియోగాన్ని 30–40 శాతం వరకు తగ్గించవచ్చు. మహిళల ఆత్మవిశ్వాసం, స్వావలంబన పెరిగింది. “డ్రోన్ టెక్నాలజీ”ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లడంలో ఈ పరిణామం ఒక గొప్ప ముందడుగు. కేంద్ర ప్రభుత్వం ‘డ్రోన్స్ ఫర్ అగ్రికల్చర్’ పథకం కింద మహిళా సమూహాలకు రాయితీతో డ్రోన్లు అందిస్తోంది. శిక్షణా కేంద్రాలు, “డ్రోన్ లైసెన్సింగ్” సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.” అని మోడీ వెల్లడించారు. ఈ మహిళలను “స్కై వారియర్స్”గా మోడీ సంబోధించారు.
READ MORE: Tej Pratap Yadav: 12 ఏళ్లుగా ప్రేమలో ఉంటే, ఐశ్వర్యా రాయ్‌ని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్..
అనంతరం ఏపీ గురించి మాట్లాడారు. “11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం” ఈ ఏడాది జూన్ 21 న విశాఖపట్నంలో జరగనున్న వేడుక గురించి ప్రస్తావించారు. విశాఖపట్నంలో జరిగే “అంతర్జాతీయ యోగా దినోత్సవం” కార్యక్రమంలో మోడీ హాజరవుతున్నట్లు తెలిపారు. విశాఖపట్నం ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి అని మోడీ కొనియాడారు. విశాఖ పరిసరాల్లో యోగా చేయడం అనుభూతిని మరింత గొప్పగా చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘యోగ ఆంధ్ర’ అనే ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ యోగా ప్రాముఖ్యతను తెలియజేయడం, ప్రతి గ్రామానికి, పాఠశాలకు యోగా సాధన పరిచయం చేయడం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో 10 లక్షల మందికి పైగా యోగా అభ్యాసకులు పాల్గొనబోతున్నాట్లు వెల్లడించారు. ప్రత్యేక శిబిరాలు, స్కూల్ యోగా ప్రోగ్రామ్‌లు, మెగా ఈవెంట్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
READ MORE: PM Modi: ‘‘మాట పదిలం’’.. ఎన్డీయే నాయకులకు ప్రధాని కీలక సలహా..
