PM Modi: ప్రతిపక్ష ముఖ్యమంత్రులతో టీ తాగుతూ ప్రధాని మోడీ ముచ్చట్లు.. నవ్వులే.. నవ్వులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు నీతి ఆయోగ్ కి సంబంధించి కీలక సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో 2047 వరకు అభివృద్ధి చెందిన భారతదేశ ప్రణాళికలపై చర్చించారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. ప్రధాని మోడీ వారితో టీ తాగుతూ చర్చిస్తున్న ఫొటోలు కనిపించింది.
Also Read
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతోనూ ప్రధాని మోడీ ముచ్చటించారు. ప్రతిపక్ష ముఖ్యమంత్రులను ప్రధాని మోడీ ఆప్యాయంగా పలకరించారు.
మరో ఫోటోలో ప్రధాని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను కలిసిన దృశ్యం కనిపించింది. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో భాగం. కానీ.. ప్రధాని మోడీ, ఎంకే స్టాలిన్‌కి మధ్య ఇటీవలి భాషా వివాదంపై వాడీవేడి రాజకీయం రాజుకున్న విషయం తెలిసిందే.
భాషా వివాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కఠిన వైఖరి తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఈ అంశంపై మిశ్రమ వైఖరిని కనబర్చినట్లు అనిపించింది. అయితే, నీతి ఆయోగ్ సమావేశం తర్వాత భారత్ మండపంలో ఇద్దరు నాయకులు ప్రధాని మోడీతో చాలా ఆప్యాయంగా కనిపించారు. ముచ్చట్లు పెడుతూ.. నవ్వులు పూయించారు.
మరో ఫోటోలో కాంగ్రెస్ పాలిత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రధాని మోడీని కలిసిన దృశ్యాలు ఉన్నాయి. ఈ చిత్రంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా కనిపిస్తున్నారు. ప్రధాని మోడీ సీఎం రేవంత్ రెడ్డిని చాలా ఆప్యాయంగా పలకరించారు.
ఈ సమావేశంలో, ప్రధాని మోడీ రాష్ట్రాలకు ఓ విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి వేగాన్ని పెంచాలని, కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తే ఏ లక్ష్యమూ అసాధ్యం కాదని ప్రధాని అన్నారు. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!