Job Letters: రోజ్‌గార్ మేళా కింద వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన వారికి 71,000 నియామక పత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పంపిణీ చేశారు. అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేసిన తర్వాత, ప్రధానమంత్రి కొంతమంది అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వారి జీవిత ప్రయాణాన్ని పంచుకున్నారు.
దేశవ్యాప్తంగా ఎంపికైన కొత్తవారు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జూనియర్ ఇంజనీర్లు, లోకో పైలట్లు, టెక్నీషియన్లు, ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, స్టెనోగ్రాఫర్లు, జూనియర్ అకౌంటెంట్లు, గ్రామీణ డాక్ సేవక్, ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, ఉపాధ్యాయులు వంటి వివిధ ఉద్యోగాల్లో చేరనున్నారు. నర్సులు, వైద్యులు, సామాజిక భద్రతా అధికారులు కూడా ఉన్నారు. 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని 2022లో ప్రధాని ప్రకటించిన ‘రోజ్‌గార్ మేళా’ డ్రైవ్‌లో ఇది భాగం.
BBC documentary row: ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదాస్పదం.. అసలేం జరిగిందంటే?
ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న మోదీ నిబద్ధతను నెరవేర్చే దిశగా ఇదొక ముందడుగు అని పీఎంవో పేర్కొంది. రోజ్‌గార్ మేళాలు తమ ప్రభుత్వానికి గుర్తింపుగా మారాయని ప్రధాని మోదీ అన్నారు. తాము సంకల్పించిన వాటిని పూర్తిచేస్తామని ఇది రుజువు చేస్తుందన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు సంకల్పించాలని కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నవారికి మోదీ చెప్పారు.