NTV Telugu Site icon

Amit Shah: దేశ అంతరిక్ష యాత్రకు ప్రధాని మోడీ కొత్త వేగం, శక్తిని అందించారు..

Amit Shah

Amit Shah

Amit Shah: దేశ అంతరిక్ష యాత్రకు ప్రధాని నరేంద్ర మోదీ కొత్త వేగం, శక్తిని అందించారని, చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశం అవతరించిందని హోం మంత్రి అమిత్ షా శనివారం అన్నారు. రాజస్థాన్‌లో ‘సహకార్ కిసాన్ సమ్మేళన్’లో ప్రసంగించిన అమిత్ షా, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను లక్ష్యంగా చేసుకుని తొలగించబడిన మంత్రి రాజేంద్ర గూడా “రెడ్ డైరీ”కి సంబంధించిన ఆరోపణలపై మండిపడ్డారు. ప్రధాని మోదీ నాయకత్వం, శాస్త్రవేత్తల కృషి వల్లే చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిందని, ఇది దేశంలో కొత్త శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని నింపిందని అమిత్ షా అన్నారు. ఈ కార్యక్రమంలో కొందరు నినాదాలు చేసిన వారిపై కూడా ఆయన మండిపడ్డారు.

Read Also: Nuh Voilence: నుహ్‌లో మరోసారి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత.. 144 సెక్షన్ విధింపు..!

‘ప్రధాని మోడీ మన అంతరిక్ష యాత్రకు కొత్త వేగం, శక్తిని అందించారు… ఈరోజు నినాదాలు చేసిన ప్రజలకు నేను చెప్పాలనుకుంటున్నాను, వారు నినాదాలు చేసే బదులు చంద్రయాన్‌ను ముందుకు నెట్టి ఉంటే నినాదాలు చేసే స్థాయికి వచ్చేవారు కాదు.” అని అమిత్ షా అన్నారు. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ‘‘ఈరోజుల్లో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ రెడ్ డైరీ అంటే చాలా భయపడుతున్నారు.. అయితే ఎందుకు భయపడుతున్నారు?… రెడ్ డైరీలో నల్లని డీడీలు దాగి ఉన్నాయి.. రెడ్ డైరీలో కోట్ల అవినీతి వివరాలు ఉన్నాయి.’’ అని అమిత్ షా ఆరోపించారు.

మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన రాజేంద్ర గూడా ‘రెడ్ డైరీ’కి సంబంధించిన ఆరోపణలు చేశారని, గెహ్లాట్ సహాయకుడు రాథోడ్ నివాసం నుంచి దానిని తీసుకున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా.. బీజేపీ ఆరోపణలు నిరాధారమైనవని, గూఢాను ప్రత్యర్థి పార్టీ బలిపశువుగా చేసిందని గెహ్లాట్ అన్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరంలతో పాటు ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో రాజస్థాన్ కూడా ఉంది. వచ్చే నెలలో రాష్ట్రంలో నాలుగు ‘పరివర్తన్ యాత్ర’లను బీజేపీ ప్లాన్ చేస్తోంది.