Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన విషాదకరమైన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ప్రమాదానికి సంబంధించి శవాల గుర్తింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా.. గుజరాత్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ వైద్య, విద్యాశాఖ మంత్రి రుషికేశ్ పటేల్ శుక్రవారం కీలక సమాచారం వెల్లడించారు.
Read Also: MLC Kavitha : పోలవరం ముంపు సమస్యలపై తెలంగాణ జాగృతి రౌండ్‌టేబుల్
ఆయన తెలిపిన వినరాల ప్రకారం.. ఇప్పటివరకు 220 మృతదేహాల డీఎన్‌ఏ నమూనాలను కుటుంబ సభ్యులతో మ్యాచ్ చేయగా, 202 మృతదేహాలను అప్పగించారు. మిగిలినవి కూడా త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మృతదేహాల్లో 15 విమానం ద్వారా పంపించగా, 187 అంబులెన్స్ ద్వారా వారి స్వగ్రామాలకు తరలించారు. మిగతా మృతదేహాలను త్వరలో అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
Read Also: 1993 plane crash : 1993 విమాన ప్రమాదం.. ఇచ్చిన మాట తప్పిన బాలయ్య, చిరు
ఇది ఇలా ఉండగా.. ఎయిర్ ఇండియా సీఈఓ అండ్ ఎండీ కాంప్‌బెల్ విల్సన్ మాట్లాడుతూ.. AI-171 డ్రీమ్‌లైనర్ విమానం చక్కగా నిర్వహించబడుతోందని, దానిలో ఎలాంటి సాంకేతిక లోపాలూ ప్రయాణానికి ముందు కనిపించలేదని స్పష్టం చేశారు. చివరిసారి ప్రధాన తనిఖీ జూన్ 2023లో నిర్వహించగా.. కుడి ఇంజిన్ 2025 మార్చిలో ఓవర్‌హాల్, ఎడమ ఇంజిన్ 2025 ఏప్రిల్‌లో తనిఖీ చేయబడిందని వెల్లడించారు. అలాగే తదుపరి మెయింటెనెన్స్ డిసెంబర్ 2025కి షెడ్యూల్ అయిందని వివరాలను అందించారు.
Summary of Mortal Remains
UPDATED UP TO :- 20/06/2025 , 11:45 A.M.
NO. OF DNA MATCH – 220
NO. OF RELATIVES CONTACTED- 220
NO. OF MORTAL RELEASED- 202
……….
Indians 151
Portuguese 7
British 34
Canada 1
Non passengers 9
………
BY AIR – 15
By road via ambulance -…— Rushikesh Patel (@irushikeshpatel) June 20, 2025