PM Modi: 23న అయోధ్యలో మోదీ పర్యటన.. 15లక్షల మందితో దీపోత్సవ వేడుక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దీపావళిని అయోధ్యలో జరుపుకోనున్నారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దీపావళి వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. ప్రతీయేటా దీపావళికి ఒకరోజు ముందు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీపోత్సవ్ వెలుగుల పండుగని నిర్వహిస్తోంది. దీనిలో ప్రజలు అయోధ్యలోని నదీతీరంలో ‘ద్వీపాలతో’ వరుసలో ఉంటారు. గత ఏడాది తొమ్మిది లక్షల మందితో రికార్డు నెలకొల్పగా.. 23న 15లక్షల మందితో చారిత్రాత్మక ప్రపంచ రికార్డు నెలకొల్పేలా యూపీ పర్యాటక శాఖ కృషి చేస్తుంది. అక్టోబర్ 23న సరయూ నది ఒడ్డున నెలకొని ఉన్న రామ్‌కీ పైడి ఘాట్‌ల శ్రేణిలో దీపోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. తద్వారా అయోధ్యలోని భక్తుల సమక్షంలో దీపావళి పండుగను జరుపుకోనున్నారు.
Read Also: Phone : ఫోన్ తీశాడంటూ బావిలో వేలాడదీశారు.. చిన్నారిపై క్రూరత్వం
Also Read
అయోధ్యలో దీపోత్సవ సంప్రదాయం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో ప్రారంభమైంది. 2017లో 51వేల మంది దివ్యాంగులతో ప్రారంభమై, 2019లో 4.10 లక్షలకు, 2020లో ఆరు లక్షలకుపైగా, గత ఏడాది తొమ్మిది లక్షలకు పైగా చేరి కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పింది. ఈ ఏడాది దాదాపు 15లక్షల మందితో మళ్లీ చారిత్రాత్మక ప్రపంచ రికార్డును నెలకొల్పనున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక శాఖ ట్వీట్ చేసింది.
Read Also: Weight Loss : బంపర్ ఆఫర్.. బరువు తగ్గితే రూ.1000కోట్ల బహుమతి
అక్టోబర్ 23న సాయంత్రం 4.55 గంటలకు శ్రీ రామ జన్మభూమిలో భగవాన్ శ్రీ రామ్ లాలా విరాజ్‌మన్‌కు ప్రధాని మోదీ ప్రార్ధనలు చేస్తారు. 5.05 గంటలకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర స్థల పరిశీలించి, దర్శనం చేసుకుంటారు. 5.40గంటలకు శ్రీ రామ్ కథా పార్కులో నిర్వహించే శ్రీరాముని పట్టాభిషేక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. 6.25గంటలకు సరయు కొత్త ఘాట్ వద్ద హారతిలో పాల్గొంటారు. 6.40 గంటలకు రామ్ కీ పైడిలో జరిగే దీపోత్సవ్‌లో ప్రధాని పాల్గొంటారు. రాత్రి 7.25 గంటలకు సరయు కొత్త ఘాట్ వద్ద గ్రీన్ డిజిటల్ బాణసంచాని ప్రధాని మోదీ వీక్షిస్తారు.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!