రైతులకు పెట్టుబడి సాయం కింద మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తదుపరి విడత కోసం దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. సాధారణంగా ఫిబ్రవరిలోనే అందాల్సిన రూ. 2,000 నగదు.. ఈసారి మార్చి నెలాఖరు నాటికి రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రం నుంచి ఇంకా అధికారిక తేదీ ప్రకటించినప్పటికీ.. ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
నిధుల విడుదల ఆలస్యం కావడానికి ప్రధాన కారణం కేంద్రం చేపట్టిన అనర్హుల ఏరివేత. పథకంలో పారదర్శకత కోసం ప్రభుత్వం లబ్ధిదారుల రీ వెరిఫికేషన్ చేపట్టింది. అక్రమ మార్గాల్లో ఈ పథకాన్ని పొందుతున్న వారిని గుర్తించి.. ఇప్పటికే లక్షలాది మంది అనర్హులను జాబితా నుంచి తొలగించింది. కేవలం అర్హత కలిగిన రైతులకు మాత్రమే ఈ పథకం అందాలనేది ప్రభుత్వ ఉద్దేశం.
Also Read:CM Revanth Reddy: ఉమెన్స్ డే వేళ భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వారందరికీ స్కూటీలు..
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడాలంటే రైతులు ఈ-కేవైసీ (e-KYC) తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆధార్ ఓటీపీ ఉపయోగించి లేదా సమీపంలోని సీఎస్‌సీ (CSC) కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా కేవైసీ పూర్తి చేయవచ్చు. మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ కచ్చితంగా అనుసంధానమై ఉండాలి. మీ పేరు మీద ఉన్న భూమి రికార్డులు పోర్టల్‌లో అప్‌డేట్ అయి ఉండాలి.
Also Read:Brett Randell: T20 వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు.. 5 బంతుల్లో 5 వికెట్లు పడగొట్టి షాకిచ్చిన కివీస్ బౌలర్
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 14 ప్రధాన రాష్ట్రాల్లో ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ ప్రక్రియను ప్రారంభించింది. ఈ విధానం ద్వారా రైతులకు ఒక యూనిక్ ఫార్మర్ ఐడీ (Unique Farmer ID) కేటాయిస్తారు. ఈ ఐడీ ఉంటేనే భవిష్యత్తులో పీఎం కిసాన్ నిధులతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలు, రాయితీలు పొందడం సులభతరమవుతుంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్, అస్సాం తదితర రాష్ట్రాల్లో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.