BCCI: “చేసిన ప్రయోగాలు చాలు.. నువ్వు వెళ్ళిపోరా బాబు”.. గౌతమ్ గంభీర్‌పై వేటుకు బీసీసీఐ సిద్ధం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI: ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలై సిరీస్‌ను కోల్పోవడం టీమిండియా మేనేజ్మెంట్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంగ్లాండ్‌తో కనీసం రెండు మ్యాచ్‌లు ఉన్న ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్ ఓడిపోవడం ఇదే తొలిసారి. అలాగే 2019 తర్వాత ఇంగ్లాండ్‌పై ద్విపాక్షిక సిరీస్‌లో ఎదురైన మొదటి పరాజయం కూడా ఇదే. వరుసగా ఎదురవుతున్న ఈ ఘోర ఓటములు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కాంట్రాక్ట్‌ను తీవ్రమైన నిఘా నీడలోకి నెట్టాయి. గంభీర్ ఒప్పందం 2027 వరకు ఉన్నప్పటికీ, ఈ తాజా వైఫల్యాల నేపథ్యంలో కేవలం బ్యాటింగ్ యూనిట్ మాత్రమే కాకుండా, మొత్తం కోచింగ్ సెటప్‌పైనే బోర్డు సమగ్ర సమీక్ష (Performance review) చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ను బాధ్యతల నుంచి తప్పించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని నేరుగా చెప్పనప్పటికీ.. వరుస ఓటములు నేపథ్యంలో మార్పులు చేయాల్సి ఉంటుందని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. కెప్టెన్, కోచ్ ఇద్దరూ ఈ ఫార్మాట్లో త్వరలోనే ఆశించిన ఫలితాలను చూపించాల్సి ఉంటుందని బోర్డు భావిస్తోంది. అయితే, హెడ్ కోచ్ గంభీర్ మాత్రం జట్టు ప్రదర్శనను గట్టిగా సమర్థించుకుంటున్నారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన జట్టుకు, ప్రస్తుత జట్టుకు మధ్య భారీ మార్పులు వచ్చాయని గుర్తుచేశారు. జట్టులో కెప్టెన్, ఓపెనర్ మారడంతో పాటు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్లు లేరని, జట్టును పూర్తిగా రీసెట్ చేసేటప్పుడు ఇలాంటి ఫలితాలు రావడం సహజమని అభిప్రాయపడ్డారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ చేయడం, ప్రిన్స్ యాదవ్ తన రెండో మ్యాచ్ ఆడటం, హర్షిత్ రాణా ఇప్పుడే గాయం నుంచి కోలుకుని రావడం వంటి అంశాలను ప్రాక్టికల్‌గా చూడాలని, యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి సమయం పడుతుందని గంభీర్ పేర్కొన్నారు.
Also Read
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
మరోవైపు, ఈ సిరీస్‌లో వరుసగా విఫలమవుతున్న అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీల ఆటతీరుపై బోర్డు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి బంతినీ సిక్సర్ కొట్టాలనే ఉద్దేశంతో హై రిస్క్ – హై రివార్డ్ క్రికెట్ ఆడటం జట్టుకు నష్టం చేస్తుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. వీరితో పాటు యువ బ్యాటర్ తిలక్ వర్మ ఫామ్‌పై కూడా బోర్డు ప్రత్యేక నిఘా పెట్టింది. జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే తిలక్ వర్మ తదుపరి మ్యాచ్‌ల్లో ఖచ్చితంగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంటుంది. గతంలో మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను జట్టు నుంచి తప్పించినట్లుగానే, ప్రదర్శన సరిగ్గా లేకపోతే ఎలాంటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడబోమని సెలెక్టర్లు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..