Terrorist Conspiracy: హైదరాబాద్ లో ఉగ్రకుట్రకు ప్లాన్.. చంచల్ గూడ జైలు ములాకత్ నుంచి విధ్వంసానికి పథకం!

  • హైదరాబాద్ లో ఉగ్రకుట్రకు ప్లాన్
  • చంచల్ గూడ జైలు మూలకత్ నుంచి ఉగ్రకుట్రకు ప్లాన్
  • మూసారాంబాగ్, సైదాబాద్, మలక్‌పేట్ ప్రాంతాల పై పోలీసులు నిఘా
Terror Plan

Terror Plan

హైదరాబాద్ లో ఉగ్రకుట్రకు ప్లాన్ జరుగుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. చంచల్ గూడ జైలు మూలకత్ నుంచి ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తు్న్నట్లు అనుమానిస్తున్నారు. నగరంలో విధ్వంసానికి పథకం రచించినట్లు నిఘా వర్గాలు అనుమానం. జైలు నుంచే ప్రణాళికలు సాగినట్లు అనుమానిస్తున్నారు. వరుస పేలుళ్లకు కుట్ర చేస్తారన్న కేసులో ముగ్గురు నిందితులను ఇప్పటికే అరెస్టు చేశారు.

Also Read:Student Suicide: మీనాక్షికి పదే పదే ఫోన్ చేసిన రహీం.. ఉరేసుకుని యువతి సూసైడ్

×
×
Ad

నగరంలోని మూసారాంబాగ్, సైదాబాద్, మలక్‌పేట్ ప్రాంతాల పై పోలీసులు నిఘా పెట్టారు. లష్కరే-ఈ-తోయిబాకు చెందిన ఉగ్రవాది జైలు నుంచి కుట్ర చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మూలకత్ కు వచ్చిన వ్యక్తులతో ఉగ్ర దాడులపై సంభాషణలు జరిపినట్లు సమాచారం. ఉగ్రవాది మూలకత్ కు వచ్చిన భార్య ద్వారా సమాచారం చేరవేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్ర కుట్ర నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగర వ్యాప్తంగా పటిష్ఠ భద్రత చేపట్టినట్లు తెలిపారు.

Also Read:Forensic Science Lab: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో కీలక మలుపు.. 1100 ఫైల్స్ దగ్ధం

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుళ్లకు కుట్ర జరుగుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీ ఎర్రకోట పరిసరాల్లో బాంబు పేలుళ్ల అలర్ట్ జారీ చేశారు. ఎర్రకోట ముందున్న చాందిని చౌక్ వద్దగల టెంపుల్ టార్గెట్ చేసినట్లుగా రిపోర్ట్ ఇచ్చింది ఇంటెలిజెన్స్. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఐ ఈ డి బ్లాస్ట్ లకు ప్రయత్నం చేసిందంటూ కేంద్రాన్ని, ఢిల్లీ పోలీసులను హెచ్చరించింది.