India US Trade: భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందంపై భారత వాణిజ్యం & పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. బెర్లిన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. భారతదేశం ఎప్పుడు కూడా తొందరపడి లేదా తలపై తుపాకీ గురిపెట్టి వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోదని ఆయన స్పష్టం చేశారు. యూరోపియన్ యూనియన్ (EU), యునైటెడ్ స్టేట్స్ సహా, అనేక ఇతర దేశాలతో భారతదేశం వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని ఆయన అన్నారు.
READ ALSO: S-400: చైనా, పాక్‌లకు హెచ్చరిక.. S-400, S-500 ట్రైనింగ్ కోసం రష్యాకు భారత దళాలు..
జర్మనీలో జరిగిన బెర్లిన్ డైలాగ్‌లో ఆయన మాట్లాడుతూ.. “భారత్ EUతో చర్చలను కొనసాగిస్తుంది. మేము యునైటెడ్ స్టేట్స్తో మాట్లాడుతున్నాము. కానీ మేము ఒప్పందాలకు తొందరపడము, గడువులను నిర్ణయించము లేదా తుపాకీ గురిపెట్టి ఒప్పందాలను కుదుర్చుకోము” అని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా వాణిజ్య ఒప్పందాన్ని దీర్ఘకాలిక దృక్పథం నుంచి చూడాలని ఆయన అన్నారు. భారతదేశం ఎప్పుడూ తొందరపాటు లేదా హఠాత్తు నిర్ణయాలు తీసుకోదని చెప్పారు. ఇంకా ఆయన సుంకాలపై మాట్లాడుతూ.. అధిక సుంకాలను పరిష్కరించడానికి భారతదేశం కొత్త మార్కెట్లను కూడా అన్వేషిస్తోందని అన్నారు.
వాణిజ్య ఒప్పందం గురించి ఆయన మాట్లాడుతూ.. ఒక నిర్దిష్ట దేశానికి చెందిన ఉత్పత్తులను కొనుగోలు చేయాలనే నిర్ణయం కేవలం ఆ దేశం ఒప్పందంలోకి ప్రవేశించడంపై మాత్రమే ఆధారపడి ఉంటుందని అన్నారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును నిలిపివేయాలని అమెరికా ఇండియాపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో పియూష్ గోయల్ ప్రకటన కీలకమైందని విశ్లేషకులు చెబుతున్నారు.
భారతదేశం దాని నిబంధనల ప్రకారం దీర్ఘకాలిక న్యాయమైన వాణిజ్య ఒప్పందాన్ని పొందుతోందా అని గోయల్‌ను అడిగినప్పుడు.. “జాతీయ ప్రయోజనం కాకుండా మరే ఇతర ప్రాతిపదికన భారతదేశం తన మిత్ర దేశాలను ఎప్పుడూ నిర్ణయించలేదని నేను అనుకుంటున్నాను. భారత్ యూరోపియన్ యూనియన్‌తో స్నేహం చేయలేదని ఎవరైనా నాకు చెబితే, నేను దానిని అంగీకరించను, లేదా రేపు ఎప్పుడైనా ఇండియా కెన్యాతో కలిసి పనిచేయలేదని చెబితే, అది ఆమోదయోగ్యం కాదు” అని ఆయన అన్నారు.
READ ALSO: Delhi Visakhapatnam Flight: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. పవర్ యూజింగ్ షెడ్ డౌన్