Movierulz Continues Piracy: పైరసీ వెబ్సైట్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. అయినా.. movierulz పైరసీ సైట్ మాత్రం తీరు మార్చుకోవడం లేదు.. శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు ఒక్క రోజులోనే movierulz లో ప్రత్యక్షమయ్యాయి. ప్రేమంటే, 12A రైల్వే కాలనీ, రాజా weds రాంబాయి సినిమాలు ప్రస్తుతం ఈ పైరసీ సైట్లో అప్లోడ్ చేశారు. థియేటర్ నుండి క్యాం కార్డర్ ద్వారా రికార్డ్ చేసిన ప్రింట్లు వెబ్సైట్లో కనిపిస్తున్నాయి.
READ MORE: Mahavatar Narasimha : 98వ ఆస్కార్ రేసులో.. ‘మహావతార్ నరసింహా’..
మరోవైపు… ఐ బొమ్మ రవి కేసులో నాలుగో రోజు కస్టడీ విచారణ జరుగుతోంది. గత మూడు రోజులు విచారణలో రవి పెద్దగా నోరు మెదపకపోయినా, నిన్న హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్వయంగా విచారణ చేసి కీలక సమాచారం బయటకు తీసేందుకు ప్రయత్నించారు. రవి ఉపయోగించిన సర్వర్లు విదేశాల్లో ఉన్నప్పటికీ, వాటిని ఇండియా నుంచే యాక్సెస్ చేస్తున్నట్లు గుర్తించారు. పైరసీ వ్యవహారంపై ఇప్పుడు కేంద్ర ఏజెన్సీలు కూడా ఫోకస్ పెంచాయి. ముఖ్యంగా ప్రముఖ OTTలు ఇచ్చిన ఫిర్యాదుల వల్ల కేసు మరింత వేగం అందుకుంది. యూట్యూబ్, డొమైన్ హోస్టింగ్ కంపెనీలకు ఇప్పటికే నోటీసులు పంపగా, తెలంగాణ సైబర్‌క్రైమ్ టీం డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా కీలక ఆధారాలను సేకరించడానికి ప్రయత్నిస్తోంది.
READ MORE: Hema : కేసు గెలిచాను.. కానీ అమ్మను కోల్పోయాను – హైకోర్టు తీర్పుపై నటి భావోద్వేగం