Movierulz Continues Piracy: పైరసీ వెబ్‌సైట్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. అయినా.. movierulz పైరసీ సైట్ మాత్రం తీరు మార్చుకోవడం లేదు.. శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు ఒక్క రోజులోనే movierulz లో ప్రత్యక్షమయ్యాయి. ప్రేమంటే, 12A రైల్వే కాలనీ, రాజా weds రాంబాయి సినిమాలు ప్రస్తుతం ఈ పైరసీ సైట్‌లో అప్లోడ్ చేశారు. థియేటర్ నుండి క్యాం కార్డర్ ద్వారా రికార్డ్ చేసిన ప్రింట్‌లు…
సంచలనం సృష్టించిన ఐబొమ్మ (iBomma) పైరసీ కేసులో ప్రధాన నిందితుడు రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణను కొనసాగిస్తున్నారు. గత రెండు రోజులుగా పోలీసులు రవిని విచారిస్తున్నారు. రెండో రోజు విచారణలో భాగంగా ఆరు గంటలకు పైగా ప్రశ్నించగా, పోలీసులు పలు కీలక అంశాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఒకవైపు పోలీసులు తమ విచారణను వేగవంతం చేస్తుండగా, మరోవైపు అనూహ్యంగా సోషల్ మీడియాలో నిందితుడు రవికి సాధారణ ప్రజల నుంచి, నెటిజన్ల నుంచి భారీ…
‘ఐబొమ్మ’ వంటి పైరసీ సినిమా వెబ్‌సైట్లపై ఇటీవల పోలీసు చర్యలు వేగవంతమయ్యాయి. వాటిలో భాగంగా, సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ రిమాండ్‌లో చంచల్‌గూడ జైలులో ఉన్నారు. దర్యాప్తు అధికారులు రవిని కస్టడీలోకి తీసుకుని ఐదు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతి పొందారు. ఈ పరిణామాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) స్పందించారు. పైరసీ పూర్తిగా నిర్మూలం అవుతుందా…
I BoMMA Ravi Case: ఐ బొమ్మ రవిపై పోలీసులు మరో మూడు సెక్షన్‌లు జోడించారు. ఇప్పటికే రవిపై 10 సెక్షన్లు పెట్టారు. IT యాక్ట్ , BNS సెక్షన్లు, సినిమాటోగ్రఫీ యాక్ట్, ఫారినర్స్ యాక్ట్ కింద 10 సెక్షన్లు నమోదు చేశారు. తాజాగా ఫోర్జరీ సెక్షన్‌ను జోడించారు. ప్రహ్లాద్ అనే వ్యక్తి పేరు మీద పాన్ కార్డ్, బైక్ లైసెన్స్, ఆర్‌సీలు తీసుకున్నట్లు గుర్తించారు. ఫోర్జరీ సెక్షన్లు జోడిస్తూ కోర్టులో మెమో ఫైల్ దాఖలు చేశారు.…
I Bomma Ravi : ఐ బొమ్మ రవి అరెస్ట్ ఒక సంచలనంగా మారింది. ఆయన కేసులో ఎన్నో విషయాలు బయట పడుతున్నాయి. అయితే రవి తండ్రి మాత్రం తన కొడుకు చేసింది తప్పే అంటున్నారు. అతన్ని చట్ట పరంగానే శిక్షించాలని కోరుతున్నాడు. ఈ క్రమంలోనే తన మనవరాలి గురించి రవి తండ్రి చేసిన రిక్వెస్ట్ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా రవి తండ్రి అప్పారావు సీపీ సజ్జనార్ కు ఒక రిక్వెస్ట్ చేశారు. నా…
ibomma: దమ్ముంటే పట్టుకోండని సవాల్ విసిరితే… చూస్తూ ఊరుకుంటారు.. తాట తీశారు సీపీ సజ్జనార్. సినామా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం తెచ్చిపెడుతూ… జనాల పర్సనల్ డేటా చోరీ చేస్తూ.. దేశ భద్రతకే ముప్పుగా మారిన ఇమంది రవి ఆటకట్టించారు. ఇమంది రవిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏళ్ల తరబడి రవి సృష్టించుకున్న పైరసీ రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించారు. ఇప్పటికే ఐ బొమ్మ. బప్పం టీవీ, ఇరాదా వంటి సైట్లను క్లోజ్ చేసిన పోలీసులు… పైరసీ కంటెంట్…
నాని హీరోగా ఈ ఏడాది హిట్ 3 అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ సినిమా రిలీజ్‌కి 18 గంటల ముందు ఐ-బొమ్మలో ఒరిజినల్ క్వాలిటీతో రిలీజ్ అయింది. ఈ నేపధ్యంలో ప్రొడక్షన్ హౌస్ అయితే కచ్చితంగా ఇది ప్రొడక్షన్ హౌస్‌లో ఎవరో చేసిన పని అని భావించి, తమ సొంత ఉద్యోగులను అనుమానించి పోలీస్ కేసులను సైతం నమోదు చేయించి దర్యాప్తు చేయించింది. అయితే అప్పట్లో…
IBOMMA Ravi: పైరసీ కింగ్ పిన్‌గా మారిన ఐ బొమ్మ రవి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇమ్మడి రవి నేదర్ల్యాండ్స్, కరేబియన్ దీవులకు వెళ్ళే ముందు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీని నెలకొల్పాడు. వెబ్ డిజైన్ సర్వీస్ ఇస్తామని సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాడు. ER infotech అనే సాఫ్ట్వేర్ కంపెనీకు CEOగా ఉన్నాడు. ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశాడు. తన చదువు, జ్ఞానాన్ని ఉపయోగించి తెలుగు ఇండస్ట్రీని బురిడి కొట్టించాడు. గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున…