Mumbai Indians: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా?.. రూమర్లపై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Indians: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ జరగనుందంటూ వస్తున్న వార్తలపై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ స్పందించింది. హార్దిక్ పాండ్యాను దక్కించుకోవడానికి శివమ్ దూబే సహా ఇద్దరు ఆటగాళ్లను ఆఫర్ చేసేందుకు సిఎస్కే సిద్ధమైందంటూ ప్రచారం జోరందుకున్న వేళ, ఈ ఊహాగానాలన్నింటికీ ఎంఐ వర్గాలు చెక్ పెట్టాయి. చెన్నై సూపర్ కింగ్స్‌తో కానీ లేదా మరే ఇతర ఫ్రాంచైజీతో కానీ ఆటగాళ్ల ట్రేడింగ్ గురించి తాము ఎలాంటి చర్చలు జరపడం లేదని ముంబై ఇండియన్స్ అధికారిక ప్రతినిధి స్పష్టం చేశారు. ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన రివ్యూ (సమీక్ష) ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, అన్ని కోణాల్లో జట్టు ప్రదర్శనను పరిశీలిస్తున్నామని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. సీజన్ సమీక్ష పూర్తయిన తర్వాత మాత్రమే ఆటగాళ్ల బదిలీలు లేదా ట్రేడింగ్‌పై ఒక నిర్ణయానికి రావడం సాధ్యమవుతుందని, ప్రస్తుతానికి ఎవరితోనూ సంప్రదింపులు జరపడం లేదని ముంబై ఇండియన్స్ ప్రతినిధి స్పష్టం చేశారు. గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా సాధించిన విజయాలను ముంబై ఇండియన్స్ సారథిగా హార్దిక్ పునరావృతం చేయలేకపోయాడనే విమర్శలు ఉన్నాయి. ఈ సీజన్ లో ముంబై ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో విఫలం కావడంతో పాటు, డ్రెస్సింగ్ రూమ్‌లో సీనియర్ ఆటగాళ్లతో విభేదాలు వచ్చాయనే వార్తలు యాజమాన్యానికి ఇబ్బందిగా మారాయి.
హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ టాలెంట్ మేనేజ్మెంట్ విభాగం నుంచి తప్పుకోవడంతో అతడు జట్టును వీడటం ఖాయమనే ఊహాగానాలు మరింత తీవ్రమయ్యాయి. అయితే, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సాధారణంగా తన కోర్ టీమ్‌ను దీర్ఘకాలం పాటు నిలబెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంటుంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాతో పాటు హార్దిక్ పాండ్యా కూడా ఆ కోర్ గ్రూప్‌లో భాగమే. రాబోయే 2027 సీజన్ తర్వాతే ఐపీఎల్ మెగా వేలం జరగనున్న నేపథ్యంలో, జట్టులో భారీ మార్పులు చేసే ముందు హార్దిక్‌కు మరో అవకాశం ఇవ్వడానికే యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక జట్టు ఐకాన్ రోహిత్ శర్మ కూడా 2027 సీజన్ తర్వాత లీగ్‌కు వీడ్కోలు చెప్పే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?