సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. రోజుకో ఎత్తుగడతో ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఫేక్ లింక్స్, మెసేజెస్ పంపిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ మోసాలను అరికట్టడానికి ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే PhonePe Protect అనే ప్రత్యేక ఫీచర్‌ను తీసుకొచ్చింది. డిజిటల్ వరల్డ్ లో మీ డబ్బుకు మీరు దీనిని సేఫ్టీ షీల్డ్ గా పరిగణించవచ్చు. ఈ ఫీచర్ సహాయంతో, మీరు డబ్బు పంపుతున్న నంబర్ అనుమానాస్పద నంబర్ అవునా కాదా అని మీకు తెలుస్తుంది. ఈ ఫీచర్‌ను PhonePe ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో కూడా ప్రదర్శించింది.
Also Read:XPeng Flying Car: కార్లకు రెక్కలు రాబోతున్నాయి.. టెస్లాను బీట్ చేసిన చైనా కంపెనీ!
ఇప్పుడు, మీరు మోసపూరిత చరిత్ర కలిగిన నంబర్‌కు చెల్లింపు చేస్తే, మీకు హెచ్చరిక వస్తుంది. పొరపాటున కూడా మీరు మోసగాడికి డబ్బు పంపకుండా, మీ డిజిటల్ లావాదేవీ 100% సురక్షితంగా ఉండేలా చూసుకోవడం దీని ఉద్దేశ్యం. ఈ ఫీచర్ కోసం PhonePe భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) నుండి డేటాను ఉపయోగిస్తుంది. DoT ఇటీవల ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (FRI) అనే కొత్త సాధనాన్ని ప్రారంభించింది. ఈ ఫీచర్ ఆర్థిక మోసానికి సంబంధించిన మొబైల్ నంబర్‌లను ట్రాక్ చేస్తుంది.
ప్రభుత్వ రికార్డులలో “హై రిస్క్” అని గుర్తించబడిన నంబర్‌కు మీరు PhonePeలో చెల్లింపు చేస్తే, PhonePe ఆటోమేటిక్ గా చెల్లింపును బ్లాక్ చేస్తుంది. లావాదేవీ ఎందుకు బ్లాక్ చేయాల్స వచ్చిందో స్క్రీన్‌పై వివరణను ఇస్తుంది. చెల్లించబడుతున్న నంబర్ “మీడియం రిస్క్”తో అనుబంధించబడితే, యాప్ మిమ్మల్ని సందేశంతో హెచ్చరిస్తుంది. ఆపై చెల్లింపు చేయాలా వద్దా అని మీరు నిర్ణయించుకోవచ్చు.
Also Read:Gopichand P Hinduja: హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి హిందూజా కన్నుమూత..
PhonePe Protect ఫీచర్ ప్రస్తుతం జరుగుతున్న ఆన్‌లైన్ మోసాలను గణనీయంగా తగ్గిస్తుంది. ఆన్‌లైన్ మోసగాళ్ల బారిన పడి ప్రజలు UPI ద్వారా అనుమానాస్పద నంబర్‌లకు డబ్బు పంపిన సందర్భాలు చాలా ఉన్నాయి. అనుమానాస్పద నంబర్‌ల గురించి వినియోగదారులను ముందుగానే అప్రమత్తం చేసే ఈ ఫీచర్, ఎవరికీ డబ్బు పంపకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఈ ఫీచర్‌ను ఆన్‌లైన్ చెల్లింపులకు వాచ్‌డాగ్ అని కూడా పిలుస్తారు.