HP: సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలోని ఆత్మకూరులోని HP పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజల్ పంపుల్లో గమనించిన మోసంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్, డీజల్ పంపుల నుంచి ఇంధనం రాకపోయినా పరికరంలో చూపించే మీటర్ తిరుగుతూ అమౌంట్ చూపిస్తూ ఉంది. పెట్రోల్, డీజల్ ధరను వాస్తవానికి తగినంత చూపించకుండానే అమౌంట్ చూపిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. వాహనదారులు ఈ మోసాన్ని గమనించి పెట్రోల్ బంక్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. అయితే, సిబ్బంది దీనిని ఒక “టెక్నికల్ ప్రాబ్లమ్” అని వివరణ ఇచ్చారు. కానీ, అక్కడి వాహనదారులు దీనిని ఒప్పుకోలేదు. ఆ తర్వాత వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాహనదారులు, పెట్రోల్ బంకు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
Also Read: Uttam Kumar Reddy: మంత్రి కాన్వాయ్‌కి ప్రమాదం.. భారీగా దెబ్బతిన్న వాహనాలు
ఈ విషయంపై కొందరు వినియోగదారులు మాట్లాడుతూ, పెట్రోల్ బంక్ యజమానులు వినియోగదారుల జేబును కొల్లగొడుతున్నారని.. ఇలాంటి వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించారు. ఆపై విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటననికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.