మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కాన్వాయ్‌లోని 19 వాహనాలు మార్గమధ్యలో అకస్మాత్తుగా ఆగిపోయాయి. ప్రాథమిక దర్యాప్తులో సాంకేతిక లోపం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. కానీ.. అనంతరం వాహనాలు ఆగిపోవడానికి కల్తీ డీజిల్ కారణమని తెలుసుకున్నారు.
HP: సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలోని ఆత్మకూరులోని HP పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజల్ పంపుల్లో గమనించిన మోసంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్, డీజల్ పంపుల నుంచి ఇంధనం రాకపోయినా పరికరంలో చూపించే మీటర్ తిరుగుతూ అమౌంట్ చూపిస్తూ ఉంది. పెట్రోల్, డీజల్ ధరను వాస్తవానికి తగినంత చూపించకుండానే అమౌంట్ చూపిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. వాహనదారులు ఈ మోసాన్ని గమనించి పెట్రోల్ బంక్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. అయితే, సిబ్బంది దీనిని ఒక “టెక్నికల్ ప్రాబ్లమ్”…