Ramagiri MPP Election: ఎంపీపీ ఇస్తామంటూ టీడీపీ నేతలు ప్రలోభ పెట్టారు.. వీడియో రిలీజ్ చేసిన ఎంపీటీసీ!
- రామగిరి ఎంపీపీ ఎన్నికపై మరోసారి ఉత్కంఠత
- వీడియో రిలీజ్ చేసిన పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతి
- ఎంపీపీ ఇస్తామంటూ టీడీపీ నేతలు ప్రలోభ పెట్టారు
- వైసీపీలోనే కొనసాగుతా అని భారతి స్పష్టం
- 25వ తారీకు వచ్చి డబ్బులు ఇస్తాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి ఎంపీపీ ఎన్నికపై మరోసారి ఉత్కంఠత నెలకొంది. రెండు రోజుల క్రితం ముగ్గురు ఎంపీటీసీలు టీడీపీ తీర్థం పుచ్చుకోగా.. వైసీపీలోనే కొనసాగుతా అంటూ తెలుగుదేశం పార్టీ నుంచి పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతి వెనక్కి వచ్చారు. టీడీపీ నేతలు తనను భయపెట్టి బలవంతంగా వెంకటాపురం తీసుకెళ్లారని, ఇతనకు ఇష్టం లేకున్నా పార్టీ కండువా కప్పారని భారతి ఓ వీడియో రిలీజ్ చేశారు. తనకు ఎంపీపీ పదవి ఇస్తామని ఆఫర్ చేశారని, తనకు ఎలాంటి పదవీ వద్దని చెప్పినా బలవంతపెట్టారని పేర్కొన్నారు. పదవి కంటే పార్టీ ముఖ్యం అని, వైసీపీలోనే కొనసాగుతా అని భారతి స్పష్టం చేశారు.
మే 19న రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక జరగనుంది. ఎంపీపీ ఉప ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఓ ప్రకటన చేశారు. అయితే ఎంపీపీ పదవి మహిళా అభ్యర్థికి రిజర్వు కావడంతో.. రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అభ్యర్థి వేటలో పడ్డారు. ఈ క్రమంలో వైసీపీ తరఫున గెలిచిన పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని మంగళవారం బలవంతంగా వెంకటాపురం తీసుకెళ్లి.. టీడీపీ కండువా కప్పారు. భారతి టీడీపీలో చేరినట్లు పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్ ఫొటోలకు పోజులిచ్చారు. సాయంత్రం నుంచి భారతి ఎవరికీ కనిపించకుండా పోవడంతో.. వైసీపీ నేతలే ఆమెను కిడ్నాప్ చేశారంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. విషయం తెలిసిన భారతి.. ఆ వార్తలను ఖండించారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను బంధువుల ఇంట్లో ఉన్నానని వీడియో రిలీజ్ చేశారు.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్‌కు జాక్‌పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
- YS Jagan: జూనియర్ డాక్టర్ల సమ్మెపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Also Read: Nara Lokesh: నేడు అమ్మనబ్రోలులో మంత్రి నారా లోకేష్ పర్యటన!
‘ఎస్పీ మేడం గారికి నమస్కారం. నా పేరు భారతి, పేరూరు–2 ఎంపీటీసీని. నిన్న టీడీపీ కార్యకర్తలు వచ్చి నన్ను తీసుకెళ్లారు. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ నాకు టీడీపీ కండువా కప్పారు. నాకు ఎంపీపీ పదవి ఇస్తామని ఆఫర్ చేశారు. వైసీపీలో గెలిచిన నాకు.. టీడీపీలో ఎంపీపీ కావడం ఇష్టం లేదు. నేను ఇంటికి వచ్చి ఆలోచన చేశాను. పదవి కంటే పార్టీ ముఖ్యం. నేను వైసీపీలోనే కొనసాగుతా. నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. మే 19న జరిగే ఎన్నికకు హాజరుకాలేను. 25వ తారీకు వచ్చి మీ డబ్బులు మీకు ఇస్తాను’ అని ఎంపీటీసీ సభ్యురాలు భారతి చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజావార్తలు
-
Nakshathra : లవ్ యూ నాన్న, లవ్ యూ అమ్మ
-
Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. ‘శివ నువ్వు తోపు సామీ’.. స్టేజ్ పైనే డైరెక్టర్‌ను హత్తుకున్న మాస్ మహారాజా!
-
Mythri Ravi: ఫోన్లో రీల్స్ చూసినా ఏడుపొస్తోంది.. ‘అన్నమయ్య’ తర్వాత మళ్లీ ఇప్పుడే..
-
Mythri Naveen: ఈ సినిమా చూసి 10 నిమిషాలు ఏడిచాను
-
Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!