తమిళనాడులోని తిరుచ్చి జిల్లా సంగియాండపురం అన్నానగర్‌కు చెందిన 38 ఏళ్ల మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల ఓ చిన్నారి, భర్త మృతి చెందారు. దీంతో కుటుంబ పరిస్థితి దయనీయంగా మారడంతో మరో బిడ్డను అత్తగారింటి వద్దే వదిలేసి తాను ఒంటిరిగా జీవిస్తోంది. అయితే.. సదరు ఒంటరి మహిళ చర్చిలో పనిచేస్తుండగా ఆమెకు ఆనంద్ మిల్లర్ (41)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేత సంబంధానికి దారి తీసింది. దీంతో ఇద్దరూ కొన్ని రోజులు సహజీవనం చేస్తుండగానే.. ఆనంద్ మిల్లర్ శృంగారం చేస్తూ ఆమెకు తెలియకుండా వీడియో, ఫోటో తీశాడు. ఇదిలా ఉండగా ఆనంద్ మిల్లర్‌పై అనుమానం వచ్చి భర్త సెల్‌ఫోన్‌ను తీసుకుని చూడగా ఓ మహిళతో శృంగారం చేస్తున్న భర్తను చూసి షాక్‌కు గురైంది.
Also Read : SOT Raids : బర్డ్‌బక్స్, హాట్‌కప్ పబ్‌లపై కేసు నమోదు.. ఏడుగురి అరెస్ట్
ఈ క్రమంలో ఆనంద్ మిల్లర్ భార్య శ్రీరంగం ఆల్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆనంద్ మిల్లర్‌ను, సదరు మహిళను పిలిపించి ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. దీంతో సదరు మహిళ శంసుద్దీన్ అనే వ్యక్తి వివాహం చేసుకుని 2 నెలల గర్భిణిగా ఉంది. ఈ సమయంలో మళ్లీ ఆనంద్ మిల్లర్ తనతో శృంగారం చేయాలని.. లేకుంటే గతంలో తనతో పాటు శృంగారం చేసిన వీడియోను నీ భర్తకు, ఇంట్లో వాళ్లకు పంపిస్తానంటూ సదరు మహిళను బెదిరించాడు. దీంతో షాక్‌కు గురైన మహిళ తన సోదరుడికి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆనంద్ మిల్లర్‌ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
Also Read : Ravanasura: మాస్ మహారాజా.. నీ గొంతులో ఏదో తెలియని మ్యాజిక్ ఉందయ్యా